వందేభారత్‌ మిషన్‌: 10లక్షల మంది వెనక్కి!
close

తాజా వార్తలు

Published : 12/08/2020 17:51 IST

వందేభారత్‌ మిషన్‌: 10లక్షల మంది వెనక్కి!

కొనసాగుతుతోన్న వందేభారత్‌ మిషన్‌ ఐదో ఫేజ్‌

దిల్లీ: కరోనా విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా విమానయానంపై ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో వివిధ దేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే వందేభారత్‌ మిషన్‌ ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఐదో దశలో భాగంగా భారతీయులను వెనక్కి తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 10లక్షల మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి వెల్లడించారు. 

మరో లక్షా 33వేల మంది వివిధ దేశాలకు తరలివెళ్లినట్లు కేంద్రమంత్రి తెలిపారు. మే 7న ప్రారంభమైన ఈ మిషన్ ప్రస్తుతం ఐదో ఫేజ్‌ కొనసాగుతోంది. ఆగస్టు ఒకటో తేదీన ప్రారంభమైన వందేభారత్‌ ఫేజ్‌-5 ఈనెల 31వరకు కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ దశలో దాదాపు 53దేశాల నుంచి 700 విమానాల ద్వారా మరో లక్షా 20 వేల మందిని స్వదేశానికి తీసుకురానున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని