Lockdown: కలెక్టర్‌ అత్యుత్సాహం.. ప్రభుత్వం సీరియస్‌

తాజా వార్తలు

Updated : 23/05/2021 16:42 IST

Lockdown: కలెక్టర్‌ అత్యుత్సాహం.. ప్రభుత్వం సీరియస్‌

సూరజ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్‌లో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన ఓ వ్యక్తిపై అత్యుత్సాహం ప్రదర్శించిన జిల్లా కలెక్టర్ రణ్‌బీర్‌ శర్మ ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు. సూరజ్‌పూర్‌ కలెక్టర్ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించింది. నూతన కలెక్టర్‌గా గౌరవ్‌ కుమార్‌ను నియమించింది. లాక్‌డౌన్‌ పరిస్థితులను సమీక్షించేందుకు శనివారం రోడ్డుపైకి వచ్చిన రణ్‌బీర్‌ శర్మ.. బయట కనిపించిన ఓ వ్యక్తి చెంపపై కొట్టారు. ఆ యువకుడి చరవాణి సైతం నేలకేసి కొట్టారు. ఈ ఘటనను ఓ వ్యక్తి మొబైల్‌లో రికార్డ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయగా వీడియో వైరల్‌గా మారింది. 

మరోవైపు ఈ ఘటనపై రణ్‌బీర్‌ శర్మ వివరణ ఇచ్చారు. ఆ యువకుడు తొలుత టీకా కోసం బయటకు వెళ్తున్నట్లు చెప్పాడని.. పత్రాలు చూపించమంటే బామ్మ దగ్గరికి వెళ్తున్నానంటూ మాట మార్చాడని తెలిపారు. కోపంతో కొట్టేసినట్లు చెప్పిన కలెక్టర్‌.. తన ప్రవర్తన పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణ చెప్పారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని