Covaxin: కొవాగ్జిన్‌కు గుర్తింపుపై వచ్చే వారంలో WHO తుది నిర్ణయం!

తాజా వార్తలు

Published : 05/10/2021 22:53 IST

Covaxin: కొవాగ్జిన్‌కు గుర్తింపుపై వచ్చే వారంలో WHO తుది నిర్ణయం!

జెనీవా: కొవాగ్జిన్‌ టీకాను అత్యవసర వినియోగ వ్యాక్సిన్ల జాబితా (ఈయూఎల్‌)లో చేర్చాలన్న అంశంపై వచ్చే వారంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. డబ్ల్యూహెచ్‌వో, స్వతంత్ర నిపుణుల బృందం వచ్చే వారంలో భేటీ అయి కొవాగ్జిన్‌ టీకా మూడు దశల క్లినికల్‌ ట్రయల్స్‌ డేటాను, భద్రత, సామర్థ్యం, రోగ నిరోధకత తదితర అంశాలను సమీక్షించి అత్యవసర వినియోగ జాబితాలో చేర్చే అంశంపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ విషయాన్ని మంగళవారం రాత్రి డబ్ల్యూహెచ్‌వో ట్విటర్‌లో ప్రకటించింది. 

కొవాగ్జిన్‌ టీకాకు సంబంధించి ఇప్పటికే భారత్‌ బయోటెక్‌ సంస్థ ఏప్రిల్‌లో ఈఓఐ (ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌) సమర్పించింది. ఈ క్రమంలో జూలై 6న వ్యాక్సిన్ డేటా రోలింగ్‌ ప్రక్రియను ప్రారంభించినట్లు కూడా డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ఈయూఎల్‌లో చేర్చేందుకు కొవాగ్జిన్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని డబ్ల్యూహెచ్‌వోకు ఇప్పటికే సమర్పించామని, ఆ సంస్థ ఫీడ్‌బ్యాక్‌ కోసం ఎదురుచూస్తున్నట్లు భారత్ బయోటెక్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని