సోషల్‌ మీడియాకు మోదీ గుడ్‌బై..! 
close

తాజా వార్తలు

Updated : 02/03/2020 22:28 IST

సోషల్‌ మీడియాకు మోదీ గుడ్‌బై..! 

దిల్లీ: సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందిన ప్రధాని మోదీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నుంచి తాను సామాజిక మాధ్యమాల్లో ఉండకూడదన్న ఆలోచన చేస్తున్నట్లు ట్విటర్‌ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌కు దూరంగా ఉండదలచుకున్నా అని పేర్కొన్నారు. అందుకు గల కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. మోదీ చేసిన ఈ ట్వీట్‌తో అందరూ అయోమయానికి గురయ్యారు. సామాజిక మాధ్యమాల వేదికగా ప్రజలకు అందుబాటులో ఉండే మోదీ.. ఇకపై వాటికి దూరంగా ఉండాలని అనుకుంటున్నా అని చెప్పడంతో ఆయన అభిమానులు నిరాశకు గురవుతున్నారు. మరోవైపు ఆయన ఆలోచిస్తున్నా అన్నారే గానీ.. ఉండను అనలేదు కాబట్టి ఆదివారం వరకూ వేచి చూడాల్సిందేనని కొంతమంది పేర్కొంటున్నారు.
ఆయనను ట్విటర్‌లో 53.3మిలియన్లు, ఫేస్‌బుక్‌లో 44 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 35.2, యూట్యూబ్‌లో 4.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అయితే, దీనిపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. ‘వదిలేయాల్సింది సోషల్‌ మీడియాను కాదు.. ద్వేషాన్ని’ అంటూ ట్వీట్‌ చేశారు.

 

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని