పాక్‌ వైమానికదళంలో తొలి హిందూ పైలట్!

తాజా వార్తలు

Updated : 04/05/2020 23:25 IST

పాక్‌ వైమానికదళంలో తొలి హిందూ పైలట్!

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ చరిత్రలోనే తొలిసారిగా హిందూ మతానికి చెందిన ఓ వ్యక్తి ఆ దేశ వైమానిక దళంలో పైలట్‌గా నియమితులయ్యారు. ఆ దేశ వాయుసేనలో జనరల్‌ డ్యూటీ పైలట్‌గా నియమితమైన రాహుల్‌ దేవ్‌ అనే యువకుడు ఈ ఘనతను సాధించారు. రాహుల్‌ హిందువులు అత్యధికంగా నివసించే సింధ్‌ ప్రావిన్స్‌లోని అతిపెద్ద జిల్లా థార్పార్కర్‌లోని ఓ కుగ్రామానికి చెందినవారు. 

కాగా, పాక్‌ వైమానిక దళంలో రాహుల్‌ దేవ్‌ నియామకంపై ఆల్‌ పాకిస్థాన్‌ హిందూ పంచాయత్‌ సెక్రటరీ రవి దవానీ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో మైనారిటీ వర్గానికి చెందిన అనేక మంది ప్రభుత్వోద్యోగులుగా, సైనికదళంలో ఇంకా వివిధ రంగాలలో సేవలను అందిస్తున్నారని ఆయన వివరించారు. పాకిస్థాన్‌ ప్రభుత్వం మైనారిటీ వర్గాలపై దృష్టి పెడితే, భవిష్యత్తులో అనేక మంది రాహుల్‌ దేవ్‌లు దేశసేవకు సిద్ధమౌతారని ఆశాభావం వ్యక్తం చేశారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని