బస్సు-రైలు ఢీ: 29 మంది మృతి

తాజా వార్తలు

Published : 03/07/2020 22:46 IST

బస్సు-రైలు ఢీ: 29 మంది మృతి

కరాచీ: పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పంజాబ్‌లోని ఫరూఖాబాద్‌ వద్ద యాత్రికులతో వెళ్తున్న మినీ బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 29 మంది దుర్మరణం చెందారు. కాపలా లేని రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం.

నాన్‌కానా సాహిబ్‌ నుంచి సిక్కు యాత్రికులతో మినీ బస్సు వెనుదిరిగింది. అయితే కరాచీ నుంచి వస్తున్న హుస్సేన్‌ ఎక్స్‌ప్రెస్‌ లాహోర్‌లోని ఫరూఖాబాద్‌ వద్ద బస్సును ఢీకొట్టింది. వెంటనే రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. రైల్వే మంత్రి  రషీద్‌ షేక్‌ ప్రమాదం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని