Indian Army: కొండలు దాటుతూ.. టీకా వేయిస్తూ.
close

తాజా వార్తలు

Published : 09/06/2021 22:05 IST

Indian Army: కొండలు దాటుతూ.. టీకా వేయిస్తూ.

కొవిడ్‌ కట్టడికి భారత సైన్యం విశేష కృషి

శ్రీనగర్‌: శత్రుసైన్యాల నుంచి దేశాన్ని సురక్షితంగా కాపాడడం మాత్రమే కాదు.. ఆపద సమయంలో ఆపన్నహస్తం అందిస్తామని భారత సైన్యం మరోసారి చాటిచెబుతోంది. పరాక్రమమే కాదు.. మానవతా దృక్పథంలో తమకు సాటెవరూ లేరంటూ చాటుకుంటున్న భారత సైన్యం ప్రస్తుత కరోనా కష్టకాలంలోనూ అదే నిరూపించుకుంటోంది. కరోనా మహమ్మారి నుంచి కాపాడేందుకు అందిస్తున్న టీకా ప్రక్రియలో తమ వంతు చేయూతనందిస్తోంది. జమ్మూకశ్మీర్‌లోని మారుమూల ప్రాంతాల్లో నడిచి వెళ్లేందుకు సైతం కష్టమయ్యే కొండ ప్రాంతాల్లో వైద్య సిబ్బందికి సాయం చేస్తోంది. స్వయంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి తమ వంతు సేవ చేస్తోంది.

కొవిడ్‌ను కట్టడించేందుకు దేశమంతటా టీకాల పంపిణీ కార్యక్రమం విస్తృతంగా సాగుతోంది. భౌగోళికంగా సానుకూల పరిస్థితులున్న ప్రాంతంలో ఈ పని సులభమే. కానీ కొండలు, ప్రమాదకర లోయలు, వాగులు, వంకలతో నిండి ఉండే ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి? వైద్య సిబ్బంది అక్కడికి ఎలా చేరుకోవాలి?  ఈ ప్రశ్నలకు సమాధానం మా దగ్గర ఉందని చెబుతోంది ఇండియన్‌ ఆర్మీ. జమ్మూకశ్మీర్‌లోని మారుమూల ప్రాంతాల్లో టీకా ప్రక్రియ విజయవంతానికి విశేషంగా కృషి చేస్తోంది. నడిచి వెళ్లేందుకు సైతం కష్టమయ్యే ప్రాంతాల్లో వైద్య సిబ్బందికి సాయంగా నిలుస్తోంది. స్వయంగా వైద్య శిబిరాల ఏర్పాటుతో తమ వంతు సేవ చేస్తోంది. 

జమ్మూ కశ్మీర్‌లో నియంత్రణ రేఖకు దగ్గరగా.. భౌగోళికంగా క్లిష్టంగా ఉండే ఉరి పరిధిలోని గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో వైద్య సిబ్బందికి తోడ్పాటునందిస్తోంది. ఉరి పరిధిలోని అనేక గ్రామాలకు రవాణా సౌకర్యమే లేదు. అక్కడకు చేరుకోవాలంటే కొండలు, లోయలు, వాగులు దాటుకుంటూ వెళ్లడమే తప్ప.. మరో మార్గం లేదు. ఆయా ప్రాంతాల ప్రజలకు టీకా వేసేందుకు సిద్ధమైన వైద్య సిబ్బంది అక్కడికి చేరుకునేందుకు ఈ ఇబ్బందులే కళ్ల ముందు నిలిచాయి. కాగా వారికి సాయం చేసేందుకు భారత సైన్యం ముందుకొచ్చింది. వైద్య సిబ్బందిని కొండలు, లోయలు దాటిస్తూ.. సురక్షితంగా ఉరి గ్రామ పరిధి ప్రాంతాలకు చేర్చుతోంది. వారికి భద్రత, అక్కడ వైద్య శిబిరాల ఏర్పాటు, టీకా తీసుకునేలా ప్రజలకు ప్రచారం వంటి కార్యక్రమాల్లో నిమగ్నమవుతోంది. ఉరి పరిధి గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ విజయవంతం కావడంలో భారత సైన్యం చూపుతున్న సేవానిరతిపై అక్కడి స్థానికులు, వైద్య సిబ్బంది ప్రశంసలు కురిపిస్తున్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని