మహారాష్ట్రలో రెండో రోజూ 25000+ కేసులు 

తాజా వార్తలు

Updated : 19/03/2021 20:37 IST

మహారాష్ట్రలో రెండో రోజూ 25000+ కేసులు 

ముంబయి: కరోనా వైరస్‌ మహారాష్ట్రను వణికిస్తోంది. మళ్లీ అక్కడ 25వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గినప్పటికీ గత 24గంటల్లో 25,681 కొత్త కేసులు, 70 మరణాలు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ రోజు 14,400మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు 1,80,83,977 శాంపిల్స్‌ పరీక్షించగా.. 24,22,021 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 21,89,965 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 53,208మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 1,77,560 క్రియాశీల కేసులు ఉన్నాయి.

మరోవైపు, ముంబయి మహా నగరంపైనా కరోనా పంజా విసిరింది. ఒక్కరోజే రికార్డు స్థాయిలో అక్కడ 3062 కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరో 10మంది మృతిచెందారు. 1334మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు ముంబయిలో మొత్తంగా 3,55,897 కేసులు నమోదయ్యాయి. వీరిలో 3,23,281మంది కోలుకోగా.. 11,565మంది మృతి చెందారు. నగరంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 20,140గా ఉంది.

నాగ్‌పూర్‌లో తాజాగా నమోదైన కేసులు కలవరపరుస్తున్నాయి. గడిచిన 24గంటల్లోనే 3235 కొత్త కేసులు, 35 మరణాలు వెలుగుచూశాయి. ఇప్పటివరకు నాగ్‌పూర్‌లో 1,85,787 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరిలో 1,55,655 మంది కోలుకోగా.. 4563మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం నగరంలో 25,569 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని