ఊరటనిచ్చేలా ‘ఆర్‌-వాల్యూ’

ప్రధానాంశాలు

Published : 22/09/2021 05:15 IST

ఊరటనిచ్చేలా ‘ఆర్‌-వాల్యూ’

దేశంలో 1 కంటే దిగువకు..

దిల్లీ: దేశంలో కొవిడ్‌ వ్యాప్తి తీరుపై పరిశోధకులు ఊరటనిచ్చే కబురు అందించారు. ఇన్‌ఫెక్షన్‌ సోకిన వారి నుంచి ఇతరులకు వైరస్‌ ఎంతమేరకు వ్యాప్తి చెందుతుందో తెలిపే ప్రామాణిక సంఖ్య ఆర్‌-వాల్యూ (రీ-ప్రొడక్షన్‌ నంబర్‌) 1 కంటే దిగువకు తగ్గినట్లు వెల్లడించారు. ఈ సంఖ్య 1 దాటితే పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు లెక్క. ఆగస్టు నెలాఖరు నాటికి ఆర్‌-వాల్యూ 1 దాటిపోగా.. ఈనెల మధ్య నాటికి అది 0.92కి తగ్గింది. అత్యధిక క్రియాశీలక కేసులున్న మహారాష్ట్ర, కేరళలల్లోనూ ఇది 1 కంటే దిగువకు చేరడం ఊరటనిచ్చే అంశం. ఈ మేరకు చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటికల్‌ సైన్సెస్‌ (ఐఎంఎస్‌సీ) పరిశోధకులు వివరాలను వెల్లడించారు. మహా నగరాలకు సంబంధించి చెన్నై (1.11), ముంబయి (1.09), బెంగళూరు (1.06), కోల్‌కతా (1.04)ల్లో ఆర్‌-వాల్యూ 1 కంటే ఎక్కువ ఉండగా.. దిల్లీ, పుణెల్లో 1 కంటే తక్కువగా ఉంది. ఆగస్టు నెలాఖరు నాటికి దేశంలో ఆర్‌-వాల్యూ 1.17కి చేరింది. క్రమేపీ తగ్గుముఖం పట్టి ఈనెల 4-7 తేదీల మధ్య 1.11కి.. తాజాగా 1 కంటే దిగువకి చేరింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన