ఆక్సిజన్‌ సిలిండర్‌ నింపుతుండగా పేలుడు
close

ప్రధానాంశాలు

Updated : 06/05/2021 05:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆక్సిజన్‌ సిలిండర్‌ నింపుతుండగా పేలుడు

ఉత్తర్‌ప్రదేశ్‌లో ముగ్గురి మృతి
ఆరుగురికి తీవ్ర గాయాలు

లఖ్‌నవూ: సిలిండర్‌లోకి ప్రాణవాయువు నింపుతుండగా పేలుడు సంభవించడంతో ముగ్గురు మరణించారు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం లఖ్‌నవూలోని చిన్హాట్‌ ప్రాంతంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక్కడి కేటీ ఆక్సిజన్‌ కేంద్రంలో సిలిండర్‌ నింపుతుండగా పేలుడు సంభవించిందని చిన్హాట్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో ధనంజయ్‌ పాండే చెప్పారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారని, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని వివరించారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌.. ఘటనకు గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన