బంగ్లాదేశ్‌లో మహావిష్ణువు విగ్రహం స్వాధీనం

ప్రధానాంశాలు

Published : 06/08/2021 06:43 IST

బంగ్లాదేశ్‌లో మహావిష్ణువు విగ్రహం స్వాధీనం

వెయ్యేళ్లనాటిదని అంచనా

ఢాకా: వెయ్యేళ్ల నాటిదిగా భావిస్తున్న శ్రీమహావిష్ణువు నల్లరాతి విగ్రహాన్ని ఓ ఉపాధ్యాయుడి నుంచి బంగ్లాదేశ్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు అక్కడి ‘ది డైలీ స్టార్‌’ పత్రిక గురువారం వెల్లడించింది. 12 కిలోల బరువు, 23 అంగుళాల ఎత్తు, 9.5 అంగుళాల వెడల్పు ఉన్న ఈ విగ్రహం అబూ యూసఫ్‌ అనే ఉపాధ్యాయుడికి నెలన్నర క్రితం దొరికిందని, అయితే అతడు దాని గురించి తమకు తెలియజేయలేదని పోలీసులు చెప్పారు. అతడి ఇంటి నుంచి సోమవారం రాత్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చెరువు నుంచి మట్టిని తవ్వుతుండగా తనకు ఆ శిల్పం దొరికిందని, పనితో తీరిక లేకుండా ఉండడంతోనే పోలీసులకు సమాచారం ఇవ్వలేదని యూసఫ్‌ చెప్పారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన