కళాశాలల్లో దొడ్డిదారి ప్రవేశాలు ఉండకూడదు

ప్రధానాంశాలు

Published : 20/09/2021 05:00 IST

కళాశాలల్లో దొడ్డిదారి ప్రవేశాలు ఉండకూడదు

దిల్లీ హైకోర్టు తీర్పు

దిల్లీ: వైద్య కళాశాలలు సహా అన్ని విద్యా సంస్థల్లో దొడ్డిదారి ప్రవేశాలను వెంటనే నిలిపివేయాలని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. దేశంలో లక్షలాది మంది విద్యార్థులు ఎంతో కష్టపడి చదువుతున్నందున ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వకూడదని న్యాయమూర్తులు జస్టిస్‌ విపిన్‌ సంఘి, జస్టిస్‌ జస్మీత్‌ సింగ్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. భోపాల్‌లోని ఎల్‌.ఎన్‌. వైద్య కళాశాలకు చెందిన అయిదుగురు విద్యార్థులు చేసిన అప్పీలును కొట్టివేస్తూ పై వ్యాఖ్య చేసింది. కౌన్సెలింగ్‌కు హాజరుకానప్పటికీ 2016లో ఆ కళాశాల వారికి ప్రవేశం కల్పించింది. కౌన్సెలింగ్‌ ద్వారా మాత్రమే అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కళాశాలల ప్రవేశాలు జరగాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో వారిని తొలగించాలంటూ భారత వైద్య మండలి (ఎంసీఐ) లేఖలు రాసింది. అయితే దీన్ని వారుగానీ, కళాశాలగానీ పట్టించుకోలేదు. మళ్లీ లేఖ రాయడంతో దాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. వారి వినతిని ఏకసభ్య ధర్మాసనం కొట్టివేసింది. దాంతో అప్పీలు చేయగా, విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం కూడా ఇదే తీర్పు ఇచ్చింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన