టీకాలు అందితేనే ఆర్థిక పురోగమనం

ప్రధానాంశాలు

Published : 15/10/2021 05:05 IST

టీకాలు అందితేనే ఆర్థిక పురోగమనం

‘జి-20’ ఆర్థిక మంత్రుల సమావేశంలో నిర్మలా సీతారామన్‌ ఉద్ఘాటన

వాషింగ్టన్‌: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొవిడ్‌ సంక్షోభం నుంచి కోలుకొని పురోగమన బాటలో పరుగులు పెట్టేందుకు టీకాలు అత్యంత కీలకమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉద్ఘాటించారు. అన్ని దేశాలకు తగినన్ని వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేలా చూడాల్సిన ఆవశ్యకతను ఆమె నొక్కిచెప్పారు. వాషింగ్టన్‌లో జి-20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్‌ బ్యాంకు గవర్నర్ల (ఎఫ్‌ఎంసీబీజీ) నాలుగో సదస్సును ఉద్దేశించి సీతారామన్‌ బుధవారం ప్రసంగించారు. కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం నుంచి కోలుకోవడంలో పేద దేశాలకు జి-20 అండగా నిలుస్తున్న తీరును ఆమె అభినందించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ మార్పులు, అంతర్జాతీయ పన్ను విధానాలు తదితర అంశాలపై ఎఫ్‌ఎంసీబీజీ సమావేశంలో చర్చించారు.

భారత్‌లో అపార అవకాశాలు

భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావాలని పెట్టుబడిదారులు, వ్యాపార సంస్థలకు నిర్మలా సీతారామన్‌ పిలుపునిచ్చారు. బుధవారం ఆమె.. భారతీయ మూలాలున్న పలువురు ప్రముఖ సీఈవోలతో వాషింగ్టన్‌లో సమావేశమయ్యారు. ప్రస్తుతం దేశంలో అపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అమెరికా-భారత్‌ వ్యాపార మండలి (యూఎస్‌ఐబీసీ) సభ్యులు సీతారామన్‌తో విడిగా సమావేశమయ్యారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన