ఆత్మాహుతి’ దళాల కుటుంబాలకు చిరు సాయం

ప్రధానాంశాలు

Published : 20/10/2021 05:24 IST

ఆత్మాహుతి’ దళాల కుటుంబాలకు చిరు సాయం

ఇళ్లస్థలాలూ ఇస్తామంటూ తాలిబన్ల హామీ

కాబుల్‌: అమెరికా బలగాలు, అఫ్గాన్‌ సైనికులతో తాము సాగించిన పోరులో ఆత్మాహుతి బాంబర్లుగా మారి హతమైన వ్యక్తుల కుటుంబాలకు తాలిబన్ల తాత్కాలిక ప్రభుత్వం రూ.8,400 (10 వేల అఫ్గానీలు) చొప్పున చిరుసాయం అందజేసింది. ఆయా కుటుంబాలకు త్వరలో ఇళ్లస్థలాలు కూడా ఇస్తామని భరోసా ఇచ్చింది. ఆంక్షల నడుమ తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తాలిబన్లు అంతర్జాతీయ సమాజాన్ని మళ్లీ ప్రసన్నం చేసుకునే దిశగా ఈ విధమైన కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకొంటున్నారు. కాబుల్‌లోని ఓ హోటలులో ‘ఆత్మాహుతి’ బాధిత కుటుంబాలతో సమావేశమైన తాలిబన్‌ సర్కారు అంతర్గత వ్యవహారాల మంత్రి సిరాజుద్దీన్‌ హఖ్ఖాని మృతుల బంధువులను ఓదార్చి, ఆర్థికసాయం పంపిణీ చేశారు. ఈ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సయీద్‌ ఖోస్ట్లీ మంగళవారం ఈ మేరకు ఫొటోలతో సహా ట్వీట్‌ చేశారు. హోటలు సమావేశ మందిరంలో మంత్రి మాట్లాడుతూ.. పోరాటంలో మృతిచెందిన వారి త్యాగాలను ప్రశంసించారు. ఇస్లాం హీరోలుగా వారిని అభివర్ణించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన