close

తాజా వార్తలు

ఫేస్‌బుక్‌లో 300కోట్ల నకిలీ ఖాతాల తొలగింపు

వాషింగ్టన్‌: నకిలీ పోస్టులు అరికట్టేందుకు ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ఫేస్‌బుక్‌ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 2018 అక్టోబరు నుంచి 2019 మార్చి వరకు 300కోట్లకు పైగా నకిలీ ఖాతాలను తొలగించింది. 2018 అక్టోబరు-డిసెంబరు మధ్య 120కోట్లు, 2019 జనవరి-మార్చి మధ్య 219కోట్ల నకిలీ ఖాతాలను తమ ప్లాట్‌ఫాం నుంచి తొలగించినట్లు సంస్థ తెలిపింది. అంతక్రితం ఆరు నెలలతో పోలిస్తే ఈసారి రెట్టింపు సంఖ్యలో నకిలీ ఖాతాలను తొలగించింది. 

ఈ ఖాతాలతో నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తుండటమే గాక.. ఈ ఖాతాల్లో అభ్యంతరకర కంటెంట్‌ ఉన్నందునే ఈ చర్యలు తీసుకున్నట్లు ఫేస్‌బుక్‌ వెల్లడించింది. అంతేగాక.. ఈ ఖాతాదారులు ఫేస్‌బుక్‌ విధివిధానాలను ఉల్లంఘించడం కూడా ఓ కారణమని పేర్కొంది. ఖాతాల తొలగింపు అనంతరం ప్రస్తుతం ఫేస్‌బుక్‌ నెలవారీ యాక్టివ్‌ యూజర్ల సంఖ్య 2.4 బిలియన్లుగా ఉంది. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.