close

తాజా వార్తలు

ఇద్దరూ మిత్రులే.. ప్రత్యర్థులుగా మారి..

చండీగఢ్‌: వారిద్దరూ మాజీ ఐఏఎస్‌ అధికారులు, గతంలో ముఖ్యమంత్రులకు కార్యదర్శులుగా కూడా పని చేశారు. అంతకు మించి మంచి స్నేహితులు. కానీ తాజా ఎన్నికల్లో ప్రత్యర్థులుగా మారారు. అంతేకాదండోయ్ ఒకరి కొకరు  ‘ఆల్‌ ది బెస్ట్‌’చెప్పుకొని ఒకరి విజయాన్ని మరొకరు కాంక్షించారు. ఇప్పటి వరకు వీరిద్దరూ ఒక్కసారి కూడా  గెలుపొందలేదట. దీంతో తొలిసారి విజయం సాధించేందుకు ఇద్దరూ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఆసక్తికర పోటీకి పంజాబ్‌లోని ఫతేగఢ్‌సాహిబ్‌ లోక్‌సభ స్థానం వేదికైంది. వివరాల్లోకి వెళ్తే..

ఈ స్థానానికి కాంగ్రెస్‌ తన అభ్యర్థిగా అమర్‌సింగ్‌ను ప్రకటించింది. ఆయన మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్‌ అధికారి. అమర్‌సింగ్‌కు ప్రత్యర్థిగా శిరోమణి అకాళీదళ్‌ తరఫున దర్బరా సింగ్‌ గురు బరిలోకి దిగుతున్నారు. ఈయన కూడా పంజాబ్‌ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్‌ అధికారి. ఇక్కడ మరో విశేషమేంటంటే ప్రస్తుతం సిట్టింగ్‌ ఎంపీగా కొనసాగుతున్న హరీందర్‌ సింగ్‌ ఖల్సా  కూడా ఐఎఫ్‌ఎస్‌ అధికారి. గత ఎన్నికల్లో ఆప్‌ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం భాజపాలో చేరిపోయారు. దీంతో ఈ స్థానానికి ఆప్‌ తరఫున బల్జీందర్‌ సింగ్‌ బరిలోకి దిగనున్నారు.

వృత్తిగతంగా..వ్యక్తిగతంగా

అమర్‌ సింగ్‌, దర్బరా సింగ్‌ ఇద్దరికీ  వృత్తిగతంగానూ పోలికలున్నాయి. రాజకీయంలోకి రాకముందు వీరిద్దరూ ముఖ్యమంత్రులకు ప్రధాన కార్యదర్శులుగా పనిచేశారు. అప్పట్లో మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌కు అమర్‌ సింగ్‌ కార్యదర్శిగా పని చేయగా.. పంజాబ్‌ ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌కు  దర్బర్‌ సింగ్‌ గురు కార్యదర్శిగా ఉన్నారు. వ్యక్తిగతంగా వీరిద్దరూ మంచి స్నేహితులు. సర్వీసులో ఉన్న సమయంలో ఏదైనా పనిపై దర్బరాసింగ్‌ మధ్యప్రదేశ్‌ వెళ్తే.. అమర్‌ సింగ్‌ ఇంట్లో భోజనం చేయకుండా వచ్చేవారు కాదట. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత  వీరిద్దరూ ఇప్పటి వరకు ఒక్క కూడా విజయాన్ని రుచి చూడకపోవడం గమనార్హం. రాజకీయ రణరంగంలో తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు ఈ ఇద్దరు మిత్రులూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 

విజయం ఎవరిదో!
 తొలుత ఈ స్థానానికి కాంగ్రెస్‌ నుంచి బస్సిపథనా నియోజక వర్గ ఎమ్మెల్యే గురుప్రీత్‌ సింగ్‌ను బరిలోకి దింపాలని పార్టీ అధిష్ఠానం భావించింది.  కానీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో  అమర్‌సింగ్‌కు ఉన్న సాన్నిహిత్యం కారణంగా టికెట్‌ సాధించుకోగలిగారని రాజకీయవర్గాల సమాచారం. ‘‘నేను ఇక్కడే పుట్టి పెరిగాను. నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా నాకు తెలుసు. గత రెండేళ్లలో నియోజకవర్గంలోని చాలా సమస్యలు పరిష్కరించాను. నా పని తనాన్ని గుర్తించిన ప్రజలు నన్ను ఆదరిస్తారు’’అని  అమర్‌సింగ్‌ చెబుతున్నారు. మరోవైపు శిరోమణి అకాళీదళ్‌ అభ్యర్థి దర్బరా సింగ్‌కి బాదల్‌ కుటుంబ సహకారంఉంది. ఇప్పటికే  ఆయన ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. తన నిజాయతీ, పట్టుదలతో కూడిన శ్రమను ప్రజలు గుర్తించి తనను గెలుపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరు మిత్రులు మధ్య జరగుతున్న ఎన్నికల యుధ్దంలో గెలిచేదెవరో తెలియాలంటే మే 23 వరకు వేచి చూడాల్సిందే. 
ఫతేగఢ్‌ పరిధిలో 9 శాసనసభ నియోజకవర్గ స్థానాలున్నాయి. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.