close

తాజా వార్తలు

24 గంటలుగా బోరు బావిలోనే చిన్నారి!

చండీగఢ్‌: పంజాబ్‌లోని సంగరూర్‌ జిల్లాలో రెండేళ్ల బాలుడు గురువారం సాయంత్రం 4 గంటలకు బోరు బావిలో పడ్డాడు. ఆ బోరు బావి 150 అడుగుల లోతు ఉంటుందని, బాలుడు 125 అడుగుల లోతున ఇరుక్కుపోయి ఉన్నాడని అధికారులు తెలిపారు. బాలుడిని బయటకు తీయడానికి ప్రయత్నాలు జరుపుతున్నామని చెప్పారు. అతడికి రక్షించడానికి భారీ యంత్రాలు, జేసీబీలు తీసుకొచ్చారు. 24 గంటలకు పైగా బోరు బావిలోనే బాలుడు ఉండడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఫతేవీర్‌ సింగ్‌ అనే ఆ బాలుడు తన ఇంటికి దగ్గరలో ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా అందులో పడిపోయాడని అధికారులు చెప్పారు.

అతడిని బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాకుండా పోతుండడంతో అక్కడికి శుక్రవారం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, ఆర్మీ నుంచి నిపుణులు కూడా వచ్చి స్థానిక అధికారులు, సిబ్బంది, పోలీసులతో కలిసి పనిచేస్తున్నారు. ఆ బోరుబావి పక్కన దానికి సమాంతరంగా మరో గోతిని తొవ్వుతున్నట్లు పోలీసులు తెలిపారు. వాడకుండా ఉన్న ఆ బోరు బావిపై ఓ వస్త్రాన్ని వేసి వదిలేశారని, దీన్ని గుర్తించని ఆ బాలుడు ఆడుకుంటూ అందులో పడ్డాడని చెప్పారు. ఆ బాలుడికి గొట్టాల ద్వారా ప్రాణవాయువును అందిస్తున్నట్లు తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.