
తాజా వార్తలు
విజయవాడ వన్‌టౌన్, న్యూస్‌టుడే: విజయవాడ ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ అడపడుచుగా అమ్మవారిని పిలుస్తారు. పూర్వం కొండపల్లి సంస్ధానంలో భాగంగా విజయవాడ ఉండేది. ప్రకాశం బ్యారేజీ వద్దకు ప్రతి రోజు పల్లెకారులు కొండపల్లి నుంచి వస్తూ తిరిగి వెళ్లేవారు. ఈ తరుణంలో రాజ్యంతో పాటు, పల్లెకారులు జీవితాలు బాగుండాలని కొండ పైన ఉన్న అమ్మవారికి ఊరేగింపు నిర్వహిస్తానని రాజు మొక్కుకున్నారు. అందులో భాగంగా ఉత్సవాలను ప్రారంభించారు. అప్పట్లో రాజుకు బందోబస్తు నిర్వహిస్తున్న రక్షకభటులు ఉరేగింపులో భాగంగా వినాయకుని ఆలయం వద్ద అమ్మవారిని కాసేపు నిలుపుదల చేశారు. ఆ సమయంలో అమ్మవారు ఆగ్రహించి మనిషి రూపంలో ఆగకుండా ముందుకు సాగారని, రాజు ఏ వీధుల ద్వారా ఊరేగింపును నిర్వహించాలనుకున్నారో వాటిల్లో తిరిగి ఒకటో పట్టణ పోలీసు స్టేషన్(అంటే అప్పటి రక్షకభటుల కార్యాలయం) వద్ద ఉన్న వేప చెట్టు వద్ద కూర్చుంటే, వెనకే వెంబడించిన రక్షకభటులు ఆమెను ఠాణాలో బంధిస్తారు. తర్వాత వచ్చిచూడగా ఆమె కనిపించదు. దీంతో రాజు అమ్మవారిని వేడుకోగా తిరిగి ప్రత్యక్షమైందని చెబుతారు. తర్వాత ఈ కార్యాలయం కాలక్రమేణా పోలీసు స్టేషన్‌గా మారింది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఉత్సవాల ప్రారంభానికి ముందు రోజు సాయంత్రం స్టేషన్ ప్రాంగణంలో వేపచెట్టు వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించి, అక్కడ నుంచి ఊరేగింపుగా సారె, పట్టువస్త్రాలను తీసుకెళ్లి, ఆలయంలో దుర్గమ్మకు సమర్పించడం ఆనవాయితీగా మారింది. ఆ చీరనే తొలిరోజు అమ్మవారికి అలంకరిస్తారు. ఇలా నగర పోలీసు శాఖ తమ ఇంటి ఆడపడుచు పండగ అంటూ ఉత్సవాలను వారి భుజస్కంధాలపై నడిపిస్తారు. స్టేషన్ సీఐ ఉత్సవాల ముందు రోజున, ఆఖరి రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- పోలీసులపై పూల జల్లు
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ఎన్‌కౌంటర్‌ను నిర్ధారించిన సజ్జనార్
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
