close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM

1. ‘మహా’మలుపు: ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా నో

మహారాష్ట్ర రాజకీయం మరో మలుపు తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని భాజపా స్పష్టంచేసింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీకి వివరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో 105 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్‌ భాజపాను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. శివసేన తమతో కలిసి రావడం లేదని, సంఖ్యా బలంలేని కారణంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదని మహారాష్ట్ర భాజపా అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ భేటీ అనంతరం ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. శివసేనకు గవర్నర్‌ ఆహ్వానం

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా సుముఖత వ్యక్తంచేయని వేళ.. రెండో అతిపెద్ద పార్టీగా నిలిచిన శివసేనను గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్‌యారీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్‌ నేత ఏక్‌నాథ్‌ షిండేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. అక్టోబర్‌ 24న ఫలితాలు వెలువడగా.. 15 రోజులు గడిచినా ఏ పార్టీ ముందుకు రాకపోవడంతో అతిపెద్ద పార్టీగా నిలిచిన భాజపాను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్‌ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మోదీ కారణజన్ముడు: లక్ష్మణ్‌

అయోధ్య తీర్పు తర్వాత  దేశ ప్రజలు చూపిన సహనం, సంయమనం భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ హర్షం వ్యక్తం చేశారు. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అన్ని వర్గాల ప్రజలు గౌరవిస్తున్నారని తెలిపారు. అత్యంత కఠినమైన, జటిలమైన సమస్య పరిష్కారానికి చొరవ చూపిన ప్రధాని మోదీ కారణజన్ముడని లక్ష్మణ్‌ కొనియాడారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో కరీంనగర్‌ జిల్లాకు చెందిన పలువురు భాజపాలో చేరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. శారదాపీఠం స్వామీజీలకు పుష్పాభిషేకం

తెలుగు రాష్ట్రాల్లో హిందూ సనాతన ధర్మం కోసం శారదాపీఠం ప్రచారం చేస్తోందని  విశాఖ శారదాపీఠం అధిపతి శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. హిందూ ధర్మం కోసం శారదాపీఠం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు.  విశాఖ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతి శ్రీస్వత్మానందేంద్ర సరస్వతి స్వామి రెండో విడత తెలంగాణలో హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్‌లోని గాయత్రీ హిల్స్‌లో జలవిహార్‌ ఎండీ రామరాజు ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతికి, స్వాత్మానందేంద్ర సరస్వతిలకు భక్తులు పుష్పాభిషేకం నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భాజపా నిర్ణయం.. శివసేన, కాంగ్రెస్‌ కామెంట్‌

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా నిరాకరించిన నేపథ్యంలో ఆ పార్టీ మిత్రపక్షం శివసేన స్పందించింది. సీఎం పీఠంపై కూర్చొనేది శివసేనకు చెందిన వ్యక్తేనని పునరుద్ఘాటించింది. భాజపా నిర్ణయం అనంతరం శివసేన నేత సంజయ్‌ రౌత్‌ మీడియాతో మాట్లాడుతూ ‘‘శివసేన నాయకుడే సీఎం అవుతారని ఉద్ధవ్‌జీ మా ఎమ్మెల్యేలకు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూర్చోబెట్టి తీరుతాం’’ అని స్పష్టంచేశారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన రావాలని కాంగ్రెస్‌ పార్టీ కోరుకోవడం లేదని ఆ పార్టీ నేత అశోక్‌ చవాన్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మా సిద్దూ ఎక్కడ : ఇమ్రాన్‌ఖాన్‌

పాకిస్థాన్‌ భూభాగంలో కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభం సందర్భంగా తీసిన ఓ వీడియో క్లిప్‌ వైరల్‌ అవుతోంది. కార్యక్రమానికి భద్రతా సిబ్బందితో వచ్చిన ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ‘అచ్ఛా.. హమారా సిద్దూ కిదర్‌ హై’ (మా సిద్దూ ఎక్కడ ఉన్నాడు) అంటూ వెదుకుతున్న వీడియో క్లిప్‌ ఒకటి బయటికొచ్చింది. ఈ వీడియోను ట్విటర్‌లో ఇప్పుడు వేలాది మంది లైక్‌ చేస్తున్నారు. పంజాబ్‌ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూకు, ఇమ్రాన్‌కు మధ్య స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. పాక్‌ ఆహ్వానం మేరకు సిద్దూ కారిడార్‌ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఝార్ఖండ్‌:భాజపా అభ్యర్థుల తొలి జాబితా విడుదల

ఝార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు భాజపా 52 మందితో తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ విడత అభ్యర్థుల జాబితాలో 17 మంది ఎస్టీలకు, 21 మంది ఓబీసీ, ఐదుగురు మహిళలకు చోటు కల్పిస్తున్నట్లు భాజపా ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ ప్రకటించారు. ఈ నెలాఖరు నుంచి ఝార్ఖండ్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో 30 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కగా, మరో 10 మందికి నిరాశే ఎదురైంది. మొత్తం 81 స్థానాలున్న ఝార్ఖండ్‌లో మిగతా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భూమి తీసుకునేదీ లేనిదీ అప్పుడు చెబుతాం

అయోధ్య తీర్పులో సుప్రీంకోర్టు చెప్పిన ఐదు ఎకరాల స్థలాన్ని తీసుకోవాలా? వద్దా? అనే అంశంపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌బోర్డు తెలిపింది. నవంబర్‌ 26న ఈ మేరకు సమావేశం నిర్వహించి తమ నిర్ణయం ప్రకటిస్తామని పేర్కొంది. వివాదాస్పద స్థలాన్ని రామాలయ నిర్మాణానికి కేటాయించి.. సున్నీ వక్ఫ్‌బోర్డుకు 5 ఎకరాల ప్రత్యామ్నాయ స్థలాన్ని మసీదు నిర్మాణానికి  ఇవ్వాలని కేంద్రాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బుల్‌బుల్‌ తుపాను: 9 మంది మృతి

ఒడిశా, పశ్చిమ బంగాల్‌లో బుల్‌బుల్‌ తుపాను ధాటికి ఇప్పటివరకూ 9 మంది మృతిచెందినట్టు అధికారులు ప్రకటించారు. తుపాను వల్ల ప్రభావిత ప్రాంతాల్లో 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. బంగాల్‌, ఒడిశాలోని దక్షిణ జిల్లాల్లో సుమారు 4 లక్షల మంది ప్రజలు తుపాను ధాటికి గురయ్యారు.పశ్చిమ బంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ రోజు మొత్తం కంట్రోల్‌ రూంలోనే ఉండి పరిస్థితిని సమీక్షించారు. ఆదివారం ఉదయం ఆమెకు ప్రధాని మోదీ ఫోన్‌ చేసి ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఉత్సాహంగా విజయవాడ మారథాన్‌


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.