close

తాజా వార్తలు

కారు ఉన్నా.. వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ

అమరావతి: ఏపీలో వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం విస్తరణకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉన్న వారికి కూడా ఈ పథకాన్ని వర్తింప చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అన్ని రకాల బియ్యం కార్డులు కలిగిన వారితోపాటు వైఎస్‌ఆర్‌ పింఛన్‌ కార్డు, జగనన్న విద్య అర్హత ఉన్న కుటుంబాలూ ఈ పథకానికి అర్హులుగా తెలిపింది. 

మరోవైపు ఇతర కుటుంబాలకు వర్తించే ప్రమాణాలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. 12 ఎకరాల కన్నా తక్కువ మాగాణీ లేదా.. 35 ఎకరాల కన్నా తక్కువ మెట్ట భూమి ఉన్న భూ యజమానులూ ఈ పథకానికి అర్హులే. మాగాణీ, మెట్టభూములు కలిపి మొత్తం 35 ఎకరాల కన్నా తక్కువగా ఉన్న వారందరూ ఈ పథకం పరిధిలోకి వస్తారు. వీరితోపాటు ప్రభుత్వ రంగంలో పని చేస్తూ గౌరవ వేతనం పొందుతున్న ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది. కుటుంబంలో ఒక కారు ఉన్నవారికీ ఈ పథకం వర్తించనుంది.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.