
తాజా వార్తలు
పరిశోధనల లయ!
ఆ అమ్మాయికి ఆకాశం, నక్షత్రాలంటే ఇష్టం. అంతరిక్షం గురించి తెలుసుకోవాలనే ఆరాటం. ఆ ఆసక్తి, తపనే ఆమెను పరిశోధనల వైపు నడిపించాయి. గుర్తింపునూ తెచ్చిపెట్టాయి. పిన్నవయసులోనే రాష్ట్రపతి నుంచి అవార్డును అందుకుంది. తాజాగా యోనో ఎస్బీఐ ‘20 అండర్ 20’ అవార్డును గెలుచుకుంది. ఆమే విజయవాడకు చెందిన పోతునూరి లయ.
‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘యోనో ఎస్బీఐ 20 అండర్ 20’ పోటీని నిర్వహించింది. క్రీడలు, ఆవిష్కరణలు, నటన... ఇలా పది విభాగాల నుంచి కొంతమంది ప్రతిభావంతుల్ని ఎంపిక చేసింది. ప్రామిసింగ్ గేమ్ ఛేంజర్ ఫిమేల్ విభాగంలో నాకు ఈ అవార్డు వచ్చింది. ఇందుకు దేశవ్యాప్తంగా 20 ఏళ్లలోపు వారిని ఎంపికచేశారు. వడపోతల అనంతరం 60 మందిని తీసుకున్నారు. దేశవ్యాప్తంగా పబ్లిక్ ఓటింగ్ ద్వారానే విజేతల్ని ఎంపిక చేశారు. చివరకు ఇరవై మంది తేలితే వారిలో నేనూ ఉన్నా. వాహన కాలుష్యాన్ని నివారించే ఫిల్టరును తక్కువ ఖర్చుతో తయారు చేశా. ఆ ఆవిష్కరణతోపాటు నాకు వచ్చిన జాతీయ అవార్డులను పరిగణించే ఈ పురస్కారాన్ని ఇచ్చారు. ఇప్పుడు సింగపూర్‌లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో బి.టెక్.మెకానికల్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నా. పరిశోధనలు చేయడానికి ఆసియాలోనే ఉత్తమమైన యూనివర్సిటీ ఇది.
ఆ పుస్తకాలే ఎక్కువగా... మాది విజయవాడ. నాన్న సాంబశివరావు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఉద్యోగి. అమ్మ శ్రీదేవి గృహిణి. నాకో తమ్ముడు. నేను చిన్నప్పటి నుంచి స్కూల్లో జరిగే ప్రతి పోటీలో పాల్గొనేదాన్ని. ఆటలు, పాటలు, చిత్రలేఖనం, వకృత్త్వం, వ్యాసరచన... ఇలా పోటీ ఏదైనా నేను పాల్గొనాల్సిందే. ఇప్పటి వరకు నాకు వీటన్నింటిలో దాదాపు ఎనభై దాకా ప్రశంసాపత్రాలు, బహుమతులు వచ్చాయి. నాకు లెక్కలంటే చాలా ఇష్టం. అలాగే స్పేస్ కూడా. అందుకే దానికి సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా చదివేదాన్ని. నా పుట్టిన రోజులకు కూడా స్నేహితులు అంతరిక్షానికి సంబంధించిన పుస్తకాలనే బహుమతులుగా ఇచ్చేవారు. ఇలా నాకు తెలియకుండానే అంతరిక్షంపై ఇష్టం ఏర్పడింది. విజయవాడ గుణదలలోని సెయింట్ జాన్స్ హైస్కూల్లో చదివా. శారదా కాలేజీలో ఇంటర్ పూర్తిచేశా.
స్కూలు నుంచే... ఎనిమిదో తరగతి నుంచే జాతీయ స్థాయి సైన్స్ పోటీల్లో పాల్గొనేదాన్ని. పదో తరగతిలో ఆంధ్రప్రదేశ్ తరఫున మైసూర్లో జరిగిన సైన్స్ కాంగ్రెస్‌కు ప్రాతినిథ్యం వహించా. ఎకో సిస్టమ్ అనే విభాగంలో మడ అడవులపై పరిశోధన చేశా. దీనికీ అవార్డు వచ్చింది. రోజంతా పరిశోధనలతోనే గడిచిపోయేది. ఓ వైపు చదువుతూనే అన్నింటినీ సమన్వయం చేసుకునేదాన్ని. తమ్ముడికి ఆరోగ్యం సరిగా ఉండదు. ఆ సమయంలోనే నాన్నకు కడప ట్రాన్స్ఫర్ అయ్యింది. అయినా అమ్మ నాకు ఏ కష్టం కలగకుండా చూసింది. ఇలా అందరి సహకారం వల్లే నేను ప్రయోగాలతోపాటు టెన్త్‌లో పదికి పది తెచ్చుకున్నా. ఇప్పుడు ఇటువైపు వచ్చా.
* నేను పదో తరగతిలో ఉన్నప్పుడు ద హిందు పత్రిక ‘బడ్డింగ్ సైంటిస్ట్’ పేరుతో ఓ పోటీని పెట్టింది. ‘మైక్రోబియల్ ఫ్యూయల్ సెల్’ అనే పేరుతో వంటింటి వ్యర్థాల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసే పరికరాన్ని తయారుచేశాం. ఆ ప్రయోగం నన్ను విజేతను చేసింది.
* ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు ‘ఇన్నోవేషన్’ విభాగంలో 2016 - నేషనల్ ఛైల్డ్ అవార్డ్ ఫర్ ఎక్సెప్షెనల్ అఛీవ్మెంట్ అవార్డును అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అందుకున్నా. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆ పురస్కారాన్ని అంలదుకున్న విద్యార్థినిని నేనే.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- ఈ ఒక్క రోజు..
- భద్రతా సిబ్బంది నుంచే ముప్పు!
- స్మిత్ చూస్తుండగానే రోహిత్ షాడో బ్యాటింగ్
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
