
తాజా వార్తలు
హైదరాబాద్: ‘ఫిదా’వంటి బ్లాక్ బస్టర్ తర్వాత క్లాస్ డైరెక్టర్ శేఖర్‌కమ్ముల ఏ హీరోతో సినిమా తీస్తారా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ హీరో ఇంకెవరో కాదు.. అక్కినేని నాగచైతన్య. ఇటీవల ‘మజిలీ’తో మంచి విజయాన్ని అందుకున్న చైతూ తన తర్వాతి చిత్రాన్ని శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసేందుకు పచ్చజెండా ఊపారు. ఈ మేరకు చిత్ర బృందం వివరాలు వెల్లడించింది. ‘ఫిదా’తో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన భామ సాయిపల్లవి ఇందులో కథానాయికగా నటించనుంది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆగస్టు మొదటి వారం నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించడంపై నాగచైతన్య సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్విటర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘నటుడిగా నా కెరీర్ ప్రారంభించిన నాటి నుంచి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించాలని అనుకుంటూ ఉండేవాడిని. అది ఇన్నాళ్లకు నెరవేరింది. మరో అందమైన ప్రేమకథతో మీ ముందుకు రాబోతున్నాం. సునీల్ నారంగ్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబరు నుంచి ప్రారంభంకానుంది. సమయం అనుకూలించింది. మీ అందరి సహకారానికి కృతజ్ఞతలు’ అని చైతూ ట్వీట్ చేశారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- విడాకులిప్పించి మరీ అత్యాచారం...
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- రివ్యూ: వెంకీ మామ
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
ఎక్కువ మంది చదివినవి (Most Read)
