close

తాజా వార్తలు

ఐడీ అడిగితే దీపిక ఏం చేశారంటే?

ముంబయి: బాలీవుడ్‌ స్టార్‌ దీపికా పదుకొణె తన వినయంతో అందరి మనసులు దోచుకున్నారు. ముంబయి విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది గుర్తింపు కార్డు అడగ్గా.. ఆమె వారితో ప్రవర్తించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ భామ తాజాగా తన తండ్రి ప్రకాశ్‌ పదుకొణెతో కలిసి ముంబయి విమానాశ్రయానికి వచ్చారు. అయితే జీపు ఎక్కడానికి వెళ్తున్న ఆమెను భద్రతా సిబ్బంది గుర్తింపు కార్డు చూపించాలని అడిగారు. దీనికి ఆమె ఏ మాత్రం కోపం తెచ్చుకోకుండా.. వినయంగా వెనక్కి వచ్చారు. ‘మీకు ఐడీ కావాలా?’ అంటూ బ్యాగులోని కార్డు తీసి చూపించారు. ఓ సెలబ్రిటీని ఇలా అడగడం, ఆమె సాధారణ వ్యక్తిలా స్పందించడంతో దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

‘దీపిక స్టార్‌గా ఎంత ఎదిగినా ఒదిగే ఉన్నారు, అందుకే ప్రజలు ఆమెను ఇష్టపడతారు, అద్భుతం.. లవ్‌ యూ దీపిక, ఓ స్టార్‌ ఇంత వినయంగా ఎలా ఉంటారు?, దీపిక సో స్వీట్‌, భద్రతా సిబ్బంది తన పని తాను చేశారు.. దీపిక చక్కగా స్పందించారు... క్లాసీ గర్ల్‌..’ అంటూ ఈ వీడియోకు నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. మరోపక్క దీపిక ఇటీవల ‘ఛపాక్‌’ షూటింగ్‌ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె కపిల్‌ దేవ్‌ బయోపిక్‌ ‘83’లో నటిస్తున్నారు.

View this post on Instagram

Thy shall always obey rules 👍 #deepikapadukone

A post shared by Viral Bhayani (@viralbhayani) on


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.