close

తాజా వార్తలు

అనుష్క, సోనమ్‌లకు మోదీ రిప్లై

ఓ కుటుంబంలా ప్రోత్సహించారు!

ముంబయి: ఇస్రోకు అండగా ఉన్నందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ సినీ ప్రముఖులు అనుష్క శర్మ, సోనమ్‌ కపూర్‌, మధుర్‌ బండార్కర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తల కష్టాన్ని గుర్తించినందుకు ఆయన ప్రశంసించారు. చంద్రయాన్‌-2 సాఫ్ట్‌ ల్యాండింగ్‌లో భాగంగా శుక్రవారం ఆఖరు నిమిషంలో సాంకేతిక లోపం తలెత్తిన విషయం తెలిసిందే. ల్యాండర్‌ విక్రమ్‌లో సాంకేతిక సమస్య ఏర్పడి సంకేతాలు తెగిపోయాయి. దీంతో భారత ప్రజలు నిరాశ చెందారు. ఈ క్రమంలో ఇస్రో శాస్త్రవేత్తల కష్టాన్ని ఉద్దేశిస్తూ పలువురు సెలబ్రిటీలు సోషల్‌మీడియాలో పోస్ట్‌లు చేశారు. ‘మీ వెంట మేమున్నాం’ అని ధైర్యం చెప్పారు.

ఈ నేపథ్యంలో మోదీ సోనమ్‌, అనుష్క, మధుర్‌ బండార్కర్‌ చేసిన ట్వీట్లకు రిప్లై ఇచ్చారు. ఓ కుటుంబంలా ఒకర్నొకరు ప్రోత్సహించుకోవడాన్ని అభినందించారు. ఇస్రో శాస్త్రవేత్తల పట్ల భారత పౌరులు గర్వపడుతున్నారని పేర్కొన్నారు. మరోపక్క ఆదివారం విక్రమ్‌ ల్యాండర్‌ ఆచూకీని గుర్తించినట్లు ఇస్రో ప్రకటించింది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.