close

తాజా వార్తలు

భారత్‌కు అత్యంత శక్తిమంతమైన బాంబులు

సెప్టెంబరు నాటికి ఇజ్రాయెల్‌ నుంచి..

దిల్లీ: భవంతులను సైతం సునాయసంగా నేలమట్టం చేయగల శక్తిమంతమైన బాంబులు త్వరలో భారత అమ్ముల పొదిలో చేరనున్నాయి. వీటిని బాలాకోట్‌ దాడుల్లో భారత్‌ వాడింది. స్పైస్‌-2000గా పిలిచే వీటిని భారత్‌ ఇప్పుడు ఇజ్రాయెల్‌ నుంచి దిగుమతి చేసుకుంటోంది. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సెప్టెంబరు మధ్య నాటికి ఈ బాంబులు భారత వైమానిక దళానికి అందుతాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. యుద్ధ విమానాల ద్వారా జార విడిచే స్పైస్‌-2000 బాంబులు భారత్‌కు చేరితే గగనతల శక్తి సామర్థ్యాలు మరింత పెరిగినట్లేనని అధికారులు అభిప్రాయపడ్డారు. వీటితోపాటు వార్‌ హెడ్లు కూడా భారత్‌కు రానున్నాయి. 
ప్రభుత్వ ఆదేశానుసారం సుమారు వందకు పైబడి స్సైస్‌-2000 బాంబులను తక్షణం సమకూర్చుకోవాల్సిందిగా గత జూన్‌లో భారత వైమానిక దళం ఇజ్రాయెల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌ బాలాకోట్‌లోని ఉగ్ర స్థావరాలపై ఈ బాంబులతో దాడులు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 12 మిరాజ్‌-2000 యుద్ధ విమానాలు నియంత్రణ రేఖ దాటి వెళ్లి జైష్‌-ఏ-మహ్మద్‌ ఉగ్ర స్థావరాలపై స్పైస్‌-2000 బాంబులను జార విడిచాయి. ఎక్కువ బరువు వల్ల ఈ బాంబులు భవనం కాంక్రీటు పైకప్పును చీల్చుకొని లోపలికి చేరగలవు. అందులోని 70-80 కిలోల మందుగుండు పదార్థంతో భారీ పేలుడు సృష్టించగలవు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.