Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144021
            [news_title_telugu_html] => 

టాప్‌ 10 న్యూస్‌@ 5 PM

[news_title_telugu] => టాప్‌ 10 న్యూస్‌@ 5 PM [news_title_english] => FIVE PM NEWS [news_short_description] => కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రభుత్వ అధికారులను గట్టిగా హెచ్చరించారు. సరిగా పని చేయకపోతే ప్రజల విశ్వాసం కోల్పోవాల్సి వస్తుందన్నారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.‘ ప్రజల పట్ల అంత కఠిన నిర్ణయాలు ఎందుకు తీసుకోవాలి? ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులందరికీ ఇదే నా హెచ్చరిక. [news_tags_keywords] => TOP NEWS, 5 PM [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-18 17:00:15 [news_isactive] => 1 [news_status] => 2 ) )
టాప్‌ 10 న్యూస్‌@ 5 PM - FIVE PM NEWS - EENADU
close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌@ 5 PM

1. పనిచేయకపోతే ప్రజలు ఉతికారేస్తారు

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రభుత్వ అధికారులను గట్టిగా హెచ్చరించారు. సరిగా పని చేయకపోతే ప్రజల విశ్వాసం కోల్పోవాల్సి వస్తుందన్నారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.‘ ప్రజల పట్ల అంత కఠిన నిర్ణయాలు ఎందుకు తీసుకోవాలి? ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులందరికీ ఇదే నా హెచ్చరిక. ప్రజా సమస్యలన్నీ సరైన సమయంలో పరిష్కరించకపోతే చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకోమని చెబుతాను. అప్పుడు మిమ్మల్ని ఉతికారేస్తారు’ అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. పాత, కొత్త కలయికతో ప్రజల్లోకి వెళ్లాలి: నడ్డా

పాత, కొత్త నేతల కలయికతో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు. నగరంలోని భాజపా కార్యాలయంలో పార్టీ పదాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికలు, సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నడ్డా చర్చించారు. ఈ అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలని నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. వరుసగా మూడో రోజూ నిలిచిన ఆరోగ్యశ్రీ

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వరుసగా మూడో రోజు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందక నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారు. డయాలసిస్‌ మొదలుకొని గుండెకు వరకు నిత్యం వేలాది మంది రోగులు ఖరీదైన వైద్యసేవలను ఉచితంగా పొందుతుంటారు. అయితే ప్రభుత్వం పెండింగ్‌ బకాయిలను విడుదల చేయడం లేదంటూ గురువారం అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 240 ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. విజయవాడలో ప్రపంచ ఫొటోగ్రఫీ డే వేడుకలు

‘ప్రపంచ ఫొటోగ్రఫీ డే’ వేడుకలను విజయవాడ కల్చరల్‌ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రఫీ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు సభాపతి తమ్మినేని సీతారాం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఉత్తరాఖండ్ ఫొటోగ్రాఫర్ అనూప్‌షాను జీవితసాఫల్య పురస్కారంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పలువురు స్థానిక రాజకీయ ప్రముఖులు పాల్గొని అక్కడి చిత్రాలను పరిశీలించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. పాక్‌తో చర్చలు జరిగితే ఇక పీవోకే పైనే..

ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించడం మానుకునే వరకూ   పాకిస్థాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పునరుద్ఘాటించారు. ఒకవేళ చర్చలు జరిగినా అవి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ గురించే ఉంటాయని తేల్చి చెప్పారు. నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హరియాణాలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాజ్‌నాథ్‌ పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. మైనరు బాలికను చితక బాదిన గ్రామ పెద్దపై కేసు

7. 60 అడుగుల ప్రభాస్‌.. కటౌట్‌ చూశారా!

కథానాయకుడు ప్రభాస్‌ నటించిన ‘సాహో’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామోజీఫిల్మ్‌ సిటీ ఈ కార్యక్రమానికి వేదికైంది. ఈ సందర్భంగా ఫిల్మ్‌సిటీలో 60 అడుగుల ప్రభాస్‌ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ‘సాహో’ సినిమాలోని ఆయన స్టిల్‌ను కటౌట్‌గా రూపొందించారు. ఈ మేరకు తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. కోచ్‌ ఎంపికలో కమిటీకి చిత్తశుద్ధి ఉందా?

టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రిని తిరిగి ఎంపిక చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్న తరుణంలో క్రికెట్‌ సలహా కమిటీ చిత్తశుద్ధిపై మరో వివాదం వెలుగులోకి వచ్చింది. బీసీసీఐ బహిర్గతం చేసిన అధికారిక ప్రకటనలో కమిటీ చేసిన పొరపాటుపై నెటిజన్లు మండిపడుతున్నారు. న్యూజిలాండ్‌ మాజీ కోచ్‌ మైక్‌ హెసన్‌ పేరును తప్పుగా పేర్కొనడంతో ఇంటర్వ్యూల ప్రక్రియపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో క్రికెట్‌ సలహా కమిటీకి ఈ విషయంలో చిత్తశుద్ధి లేదన్నట్లు తెలుస్తోందని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ‘కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం’

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కేవలం రూ. 28 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు వ్యయాన్ని రూ.లక్ష కోట్లకు పెంచారని విమర్శించారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడారు. రివర్స్‌ పంపింగ్‌ పేరుతో నాలుగు చోట్ల నీరు ఎత్తిపోస్తూ ప్రాజెక్టు వ్యయాన్ని పెంచారని ధ్వజమెత్తారు. టెండర్లలోనూ భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆయన ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ‘సైరా’ టీజర్‌ తేదీ.. ప్రకటించిన చెర్రీ

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తీస్తున్న చిత్రం ‘సైరా’. మెగాస్టార్‌ చిరంజీవి టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఆగస్టు 20న విడుదల చేయబోతున్నట్లు నిర్మాత రామ్‌ చరణ్‌  సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. టీజర్‌కు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉందంటూ.. పోస్టర్‌ను షేర్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.