Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146685
            [news_title_telugu_html] => 

ఎయిర్‌పోర్టు గోడ దూకి.. రన్‌వేపై షికార్లు

[news_title_telugu] => ఎయిర్‌పోర్టు గోడ దూకి.. రన్‌వేపై షికార్లు [news_title_english] => man entered to runway in mumbai airport [news_short_description] => టేకాఫ్‌ అవ్వబోయే విమానం వద్ద ఓ వ్యక్తి హల్‌చల్‌ చేసిన ఘటన ముంబయి ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది........... [news_tags_keywords] => Mumbai [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => 1164548008538599424 [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 14:00:26 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఎయిర్‌పోర్టు గోడ దూకి.. రన్‌వేపై షికార్లు - man entered to runway in mumbai airport - EENADU
close

తాజా వార్తలు

ఎయిర్‌పోర్టు గోడ దూకి.. రన్‌వేపై షికార్లు

దిల్లీ: మరికాసేపట్లో టేకాఫ్‌ కాబోయే విమానం వద్ద ఓ వ్యక్తి హల్‌చల్‌ చేసిన ఘటన ముంబయి ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ముంబయి ఎయిర్‌పోర్టు వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి విమానం రన్‌వేపైకి వచ్చాడు. అదే సమయంలో అక్కడ స్పైస్‌జెట్‌ సంస్థకు చెందిన ఓ విమానం ముంబయి నుంచి బెంగళూరు బయలుదేరేందుకు సిద్దంగా ఉంది. ఆ వ్యక్తి రన్‌వేపై కాసేపు షికార్లు కొట్టాడు. అనంతరం విమానం వద్దకు వచ్చి అక్కడ అంతా పరిశీలించాడు. అతడిని గమనించిన పైలట్‌ వెంటనే ఇంజిన్‌ను నిలిపివేసి భద్రతా అధికారులకు సమాచారమందించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్‌ నటి గుల్‌ పనాగ్‌ ఈ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చూస్తూ... ‘అతడు ఎలా లోపలికి రాగలిగాడు..? అలా వస్తుంటే విమానాశ్రయ సిబ్బంది ఏం చేస్తున్నారు..? ఇంజిన్‌కు చాలా దగ్గరగా వెళ్లాడు. నేను దీన్ని నమ్మలేకపోతున్నాను’ అంటూ పోస్టు చేశారు.
దీనిపై స్పందించిన ఎయిర్‌పోర్టు అధికారులు ఆ వ్యక్తి మానసిక పరిస్థితి సరిగా లేదని వివరించారు. గోడ దూకి లోపలికి వచ్చినట్లు గుర్తించామని చెప్పారు. ఇది గమనించిన స్పైస్ జెట్ విమానం పైలట్లు ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్తగా విమానం ఇంజిన్‌ను ఆపివేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.