
తాజా వార్తలు
ఇంటర్నెట్‌డెస్క్: వజ్రాలతో పొదిగిన బంగారపు టాయ్‌లెట్ ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చైనాలోని షాంఘైలో సోమవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో దీన్ని ప్రదర్శనకు ఉంచారు. దీని ప్రత్యేకతలు చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ టాయ్‌లెట్ పైభాగంలో కూర్చోడానికి దాదాపు 40వేలకు పైగా వజ్రాలతో(334.68 క్యారెట్ల) బుల్లెట్ ప్రూఫ్ సీటును తయారు చేశారు. దీని విలువ సుమారు రూ.9కోట్ల(1.3మిలియన్ డాలర్లు) ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ టాయ్‌లెట్‌ను హాంగ్‌కాంగ్‌కు చెందిన కోరోనెట్ అనే నగల దుకాణ యజమాని ఆరోన్ షమ్ రూపొందించారు. ఇది కొనుగోలుదారులను ఆకర్షించిందా అని ఆరోన్ షమ్‌ను అడగ్గా చెప్పేందుకు ఆయన నిరాకరించారు. అంతేకాకుండా దాన్ని అమ్మకానికి ఉంచలేదని కేవలం ప్రదర్శనకు ఉంచినట్టు తెలిపారు. ఈ టాయ్‌లెట్ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో పలువురు దీన్ని తయారు చేసినందుకు ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొందరు విమర్శలు చేస్తున్నారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- పోలీసులపై పూల జల్లు
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- ఎన్‌కౌంటర్‌ను నిర్ధారించిన సజ్జనార్
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
