Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 114176
            [news_title_telugu_html] => 

వారికి ఓటేస్తే కలలు చెరిగిపోతాయి..

[news_title_telugu] => వారికి ఓటేస్తే కలలు చెరిగిపోతాయి.. [news_title_english] => Donald Trump launches 2020 re-election campaign [news_short_description] => నాలుగేళ్ల క్రితం అగ్రరాజ్యంలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు యావత్‌ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేశాయి. ఈ ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టిస్తారని భావించిన హిల్లరీ క్లింటన్‌ అంచనాలు అందుకోలేకపోయారు. [news_tags_keywords] => Donald Trump ,US,election [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-19 14:47:52 [news_isactive] => 1 [news_status] => 2 ) )
వారికి ఓటేస్తే కలలు చెరిగిపోతాయి.. - Donald Trump launches 2020 re-election campaign - EENADU
close

తాజా వార్తలు

వారికి ఓటేస్తే కలలు చెరిగిపోతాయి..

ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ చురుకైన వ్యాఖ్యలు

వాషింగ్టన్: నాలుగేళ్ల క్రితం అగ్రరాజ్యంలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు యావత్‌ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేశాయి. ఈ ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టిస్తారని భావించిన హిల్లరీ క్లింటన్‌ అంచనాలు అందుకోలేకపోయారు. అసలు ఏ మాత్రం అంచనాలే లేని డొనాల్డ్‌ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ట్రంప్‌ను ఓడించాలని హాలీవుడ్‌ నుంచి పారిశ్రామిక వేత్తల దాకా ముప్పేట దాడి చేసినా ఆయన ఏమాత్రం చలించలేదు. సామాన్యులను ప్రభావితం చేయగల సెలబ్రిటీలంతా ట్రంప్‌ను ఓడించాలని కంకణం కట్టుకున్నారు. విసృతంగా ప్రచారం చేశారు. అయినా కూడా ట్రంప్‌ను అడ్డుకోలేకపోయారు. ఇప్పుడదే ఆత్మ విశ్వాసంతో మరోసారి అధ్యక్ష పదవిపై ట్రంప్‌ కన్నేశారు. 2020లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల కోసం ప్రచారం ప్రారంభించారు. 

ఎన్నికల ప్రచారం ఇలా ఆరంభించారో లేదో అప్పుడే తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించారు. నాలుగేళ్ల క్రితం తానో రాజకీయ తిరుగుబాటుదారుడినంటూ ఆదిలోనే ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఫ్లోరిడా ప్రాంతాల్లో ర్యాలీ చేపట్టారు. హిల్లరీ క్లింటన్‌, నాలుగేళ్ల క్రితం ప్రభుత్వం, అక్రమ వలస విధానాలు తదితర అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు.

‘ 2016కు ముందున్న ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని ముక్కలు చేశాయి. మీరు నన్ను ప్రేమతో ఎన్నుకోవడం వల్ల దాన్ని తిరిగి ఏకతాటికి చేర్చగలిగాం. వీలైనన్ని రోజులు మా టీమ్‌ను(పార్టీని) మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. డెమోక్రటిక్‌ పేరు పెట్టుకున్న వారు ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని దూరం చేశారు. ఓట్లను పెంచుకోవడం కోసం అక్రమ వలసదారులకు స్వేచ్ఛనిచ్చారు. ఆ పార్టీ రాజకీయ మనుగడ కోసం అమెరికన్ల ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు. ఆ విధంగా డెమొక్రాట్లు మన దేశాన్ని నాశనం చేయాలని చూశారు. కానీ ఆ ప్రయత్నాన్ని మనం అడ్డుకున్నాం. నేరగాళ్లతో స్నేహం చేసేవారి ప్రభుత్వాలు మాకొద్దు మీరు అనుకున్నారు. మన దేశంలోని న్యాయ వ్యవస్థ, పౌరులకు తగిన గౌరవం దక్కాలని మీరు భావించారు. అందుకే రిపబ్లికన్లను ఎన్నుకున్నారు. 2020లో మీరు ఏ డెమోక్రాట్‌కు ఓటేసినా అమెరికన్ల కలలు చెరిగిపోతాయి.మీకు నేను మాటిస్తున్నాను.మిమ్మల్ని తలదించుకునేలా చేయను’ అంటూ వాక్బాణాలు విసిరారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.