Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144013
            [news_title_telugu_html] => 

పాక్‌తో చర్చలు జరిగితే ఇక పీవోకే పైనే..

[news_title_telugu] => పాక్‌తో చర్చలు జరిగితే ఇక పీవోకే పైనే.. [news_title_english] => If any dialogue with Pakistan it will be on PoK only says Rajnath singh [news_short_description] => ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించడం మానుకునే వరకూ   పాకిస్థాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పునరుద్ఘాటించారు. ఒకవేళ చర్చలు జరిగినా అవి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ గురించే ఉంటాయని తేల్చి చెప్పారు.  నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హరియాణాలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాజ్‌నాథ్‌ పాల్గొన్నారు. [news_tags_keywords] => Rajnath singh, PoK, Pakistan, Imran Khan [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => LafOGZB1GtM [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 00:29:13 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పాక్‌తో చర్చలు జరిగితే ఇక పీవోకే పైనే.. - If any dialogue with Pakistan it will be on PoK only says Rajnath singh - EENADU
close

తాజా వార్తలు

పాక్‌తో చర్చలు జరిగితే ఇక పీవోకే పైనే..

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ స్పష్టం

కల్కా (హరియాణా): ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించడం మానుకునే వరకూ   పాకిస్థాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పునరుద్ఘాటించారు. ఒకవేళ చర్చలు జరిగినా అవి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ గురించే ఉంటాయని తేల్చి చెప్పారు. 
నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హరియాణాలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాజ్‌నాథ్‌ పాల్గొన్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసిన తర్వాత పాకిస్థాన్‌ ఆందోళన చెందుతోందని అన్నారు. ‘‘ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో తమకు మద్దతు పలకాలని పాక్‌ ఇతర దేశాల తలుపు తడుతోంది. మనం ఏం తప్పు చేశాం. ఎందుకు మనం భయపడాలి. ఈ విషయంలో అగ్ర రాజ్యం అమెరికానే పాక్‌కు మొట్టికాయలు వేసింది. భారత్‌తో చర్చలు జరుపుకొని సమస్య పరిష్కరించుకోవాలని సూచించింది.’’ అని అన్నారు.
ఉగ్రవాదం ద్వారా భారత్‌లో అస్థిర వాతావరణం నెలకొల్పి, బలహీన పర్చాలని పాక్‌ యోచిస్తోందని రాజ్‌నాథ్‌ ఆరోపించారు. వారి ఎత్తుగడలకు ఎలాంటి సమాధానం ఇవ్వాలో మన ప్రధాని మోదీకి సరిగ్గా తెలుసని వ్యాఖ్యానించారు. ‘‘బాలాకోట్‌ వైమానిక దాడి జరిగిన అనంతరం, పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తమపై ఎలాంటి దాడులు జరగలేదని బుకాయించారు. తాజాగా భారత్‌ బాలాకోట్‌ కన్నా పెద్ద దాడులకు ప్రణాళిక రచిస్తోందని ఆయనే ఆరోపించారు. అంటే, బాలాకోట్‌ దాడులు జరిగినట్లు ఆయన అంగీకరించినట్లే కదా..’’ అని రాజ్‌నాథ్‌ ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడారు.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.