Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145684
            [news_title_telugu_html] => 

‘ఈవీ’లకు మారేందుకు గడువేం లేదు

[news_title_telugu] => ‘ఈవీ’లకు మారేందుకు గడువేం లేదు [news_title_english] => No deadline for automobile companies to adopt electric vehicles Nitin Gadkari [news_short_description] => దేశంలో ఆటోమొబైల్‌ రంగం ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు ఉపశమనం కలిగించేలా కేంద్ర రోడ్డు,రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ మంత్రి బుధవారం కొన్ని వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆటోమొబైల్‌ పరిశ్రమలు ఇంధన వాహనాల నుంచి విద్యుత్తు వాహనాల తయారీకి మార్పు చేసేందుకు కేంద్రం ఎలాంటి గడువు పెట్టలేదని తెలిపారు. [news_tags_keywords] => nitin gadkari,niti aayog,automobile,dead line [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 23:10:19 [news_isactive] => 1 [news_status] => 2 ) )
‘ఈవీ’లకు మారేందుకు గడువేం లేదు - No deadline for automobile companies to adopt electric vehicles Nitin Gadkari - EENADU
close

తాజా వార్తలు

‘ఈవీ’లకు మారేందుకు గడువేం లేదు

దిల్లీ: దేశంలో ఆటోమొబైల్‌ రంగం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల నేపథ్యంలో ఆ రంగానికి ఉపశమనం కలిగించేలా కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం కొన్ని వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ఆటోమొబైల్‌ కంపెనీలు విద్యుత్‌ వాహనాలకు మారేందుకు కేంద్రం ఎలాంటి గడువూ పెట్టలేదని తెలిపారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఇంధన రహిత వాహనాల అమలుకు కట్టుబడి ఉందని వివరించారు. గత కొద్ది నెలలుగా ఆటోమొబైల్‌ రంగం సంక్షోభం ఎదుర్కొంటూ, ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. 

నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యుత్‌ వాహనాలను తీసుకొచ్చి వీటి తయారీ హబ్‌గా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. జూన్‌ 21న జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రభుత్వం 2025 కల్లా 150సీసీ ద్విచక్రవాహనాలు, 2023 కల్లా త్రిచక్ర వాహనాలను విద్యుత్‌ వాహనాలకు మార్చాలని ఆటోమొబైల్‌ కంపెనీలకు సూచించింది. ఇందుకోసం విద్యుత్‌ వాహనాల పై ఉన్న జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి, ఛార్జర్ల పై ఉన్న జీఎస్టీని 18 నుంచి 12 శాతానికి తగ్గించింది. జులైలో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో విద్యుత్‌ వాహనాల తయారీ రంగానికి ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు, ఆ వాహనాల కొనుగోలుదారులకు పన్ను తగ్గింపు వంటి అంశాలను ప్రకటించిన విషయం తెలిసిందే. 

విద్యుత్‌ వాహనాల తయారీకి సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి విధానమూ లేదు. ఇందుకోసం నీతిఆయోగ్‌ ప్రణాళికలు తయారు చేస్తోంది. ఈ విధానం అమలుకు కంపెనీల వాటాదారులను సంప్రదించకుండా కేంద్రం ఎలాంటి గడువూ విధించదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వమైతే విద్యుత్‌ వాహనాల అమలు ప్రోత్సహిస్తుంది గానీ.. ఆటోమొబైల్‌ పరిశ్రమలకు ప్రస్తుతానికి ఎలాంటి గడువూ విధించలేదని పేర్కొన్నారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.