Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000467
            [news_title_telugu_html] => 

ఎంత మంచి ఖైదీలో..

[news_title_telugu] => ఎంత మంచి ఖైదీలో.. [news_title_english] => Gentleman jailbreak Convicts return to Indonesia prison [news_short_description] => సాధారణంగా జైల్లో శిక్ష అనుభవించే ఖైదీలు అవకాశం చిక్కితే పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటారు. జైలు గోడలు బద్దలుకొట్టుకునో లేదా వారిని కోర్టులకు తీసుకెళ్లే సమయంలో పోలీసుల కళ్లుగప్పి తప్పించుకోవాలని [news_tags_keywords] => Prisoners,Indonesia,Roits,jailbreak [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 10:24:14 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఎంత మంచి ఖైదీలో.. - Gentleman jailbreak Convicts return to Indonesia prison - EENADU
close

తాజా వార్తలు

ఎంత మంచి ఖైదీలో..

సోరంగ్‌(ఇండోనేషియా): సాధారణంగా జైల్లో శిక్ష అనుభవించే ఖైదీలు అవకాశం చిక్కితే పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటారు. జైలు గోడలు బద్దలుకొట్టుకునో లేదా వారిని కోర్టులకు తీసుకెళ్లే సమయంలో పోలీసుల కళ్లుగప్పి తప్పించుకోవాలని చూస్తుంటారు. కానీ ఈ ఖైదీలు మాత్రం తప్పించుకునే అవకాశం వచ్చి జైలు నుంచి బయటపడినా.. శిక్ష పూర్తి చేసుకునేందుకు తిరిగొచ్చారు. ఇండోనేషియాలోని సోరంగ్‌ నగరంలో జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళితే..

ఇండోనేషియాలోని సురబయ నగరంలో కొందరు పపువా విద్యార్థులను గతవారం అరెస్టు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు, హింసాత్మక అల్లర్లకు దిగారు. ఈ క్రమంలో సోరంగ్‌లోని జైలుకు నిప్పుపెట్టారు. అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో భయాందోళనకు గురైన జైల్లోని ఖైదీలు బయటకు పరుగులు తీశారు. 

జైల్లో 500 మంది ఖైదీలుండగా సగానికి పైగా పారిపోయారు. ఘటన అనంతరం వీరి కోసం పోలీసులు గాలించే ప్రయత్నం చేశారు. అయితే అంతలోనే ఊహించని విధంగా పారిపోయిన ఖైదీలు జైలుకు తిరిగొచ్చారు. హత్య కేసులో దోషులు కూడా శిక్ష పూర్తిచేసుకునేందుకు స్వచ్ఛందంగా వెనక్కి రావడం గమనార్హం. రావడమే కాదు.. ఘర్షణల్లో ధ్వంసమైన జైలు భవనానికి మరమ్మతు చేయడంలోనూ ఖైదీలు సాయం చేశారు. 

ఈ సందర్భంగా జైలు అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. ‘దాదాపు 270 మంది ఖైదీలు తిరిగి జైలుకు వచ్చారు. సాధారణంగా జైలు నుంచి తప్పించుకునే అవకాశం వస్తే ఎవరూ వదిలిపెట్టరు. కానీ మేం ఖైదీలను బాగా చూసుకుంటాం. అంతేగాక.. జైలు నుంచి పారిపోయిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో వారికి తెలుసు. అందుకే వారంతా స్వచ్ఛందంగా తిరిగొచ్చారు’ అని తెలిపారు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.