
తాజా వార్తలు
గురుదాస్‌పుర్: బాలీవుడ్ నటుడు సన్నీ దేవోల్‌ను పంజాబ్‌లోని గురుదాస్‌పుర్ నుంచి బరిలోకి దించడంపై భాజపా మీద కాంగ్రెస్ విమర్శలు చేసింది. భాజపా సన్నీ దేవోల్ లేక సన్నీ లియోనీ ఎవరిని బరిలోకి దించినా పంజాబ్‌లో కాంగ్రెస్ వేవ్‌ను అడ్డుకోవడం సాధ్యం కాదని హోశియాపుర్ కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ కుమార్ చబ్బేవాల్ స్పష్టం చేశారు. చబ్బేవాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. పంజాబ్‌లో కనీసం మూడు స్థానాల్లో బరిలోకి దించడానికి వారికి అభ్యర్థులు కూడా దొరకలేదు. గురుదాస్‌పుర్ నుంచి సన్నీ దేవోల్‌ను పోటీకి దింపారు. భాజపా సన్నీ దేవోల్, సన్నీ లియోనీ.. ఎవరిని బరిలోకి దింపినా కాంగ్రెస్ ప్రభంజనాన్ని అడ్డుకోలేరు’ అని పేర్కొన్నారు.
గురుదాస్‌పుర్ నియోజకవర్గం గురించి దేవోల్‌కు ఏ మాత్రం అవగాహన లేదంటూ మొదటి నుంచి విమర్శలు చేస్తున్నారు అక్కడి కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ సునీల్ జాఖర్. గురుదాస్‌పుర్‌లో సన్నీ దేవోల్ చేసిన చిన్నపాటి ప్రసంగాన్ని గుర్తు చేస్తూ ఎద్దేవా చేశారు. ‘ఆయన అసలు ప్రసంగమే చేయలేదు. ఆయన సినిమాల్లోని చిన్న డైలాగ్ చెప్పారు. గురుదాస్‌పుర్ ప్రజలను అర్థం చేసుకోవడంలో ఆయన విఫలమై ఉంటారు’ అని జాఖర్ విరుచుకుపడ్డారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- శ్వేతసౌధంలో ఏకాకి!
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
- ఎస్కేయూ ఉపకులపతి జయరాజ్ హఠాన్మరణం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
