News In Pics: చిత్రం చెప్పే సంగతులు- 01(07-04-2023)

Updated : 07 Apr 2023 05:39 IST
1/15
 జన్మనిచ్చిన తల్లిదండ్రులను మరిచిపోకుండా వారి విగ్రహాలను తయారు చేయించి పూజిస్తున్నారు తాళ్లూరి సురేష్‌ కుమార్‌. లక్ష్మణరావు, లక్ష్మీమనోహరం దంపతుల విగ్రహాలను జీవం ఉట్టిపడేలా రూ.4 లక్షలతో తయారు చేయించారు. వాటిని  కృష్ణా జిల్లా గుడివాడ మండలం మల్లాయపాలెం గ్రామంలోని తాళ్లూరి కల్యాణ మండపంలో ఏర్పాటు చేశారు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మరిచిపోకుండా వారి విగ్రహాలను తయారు చేయించి పూజిస్తున్నారు తాళ్లూరి సురేష్‌ కుమార్‌. లక్ష్మణరావు, లక్ష్మీమనోహరం దంపతుల విగ్రహాలను జీవం ఉట్టిపడేలా రూ.4 లక్షలతో తయారు చేయించారు. వాటిని కృష్ణా జిల్లా గుడివాడ మండలం మల్లాయపాలెం గ్రామంలోని తాళ్లూరి కల్యాణ మండపంలో ఏర్పాటు చేశారు
2/15
  ‘మీటర్‌’ చిత్ర కథానాయిక అతుల్య రవి.. చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం విశాఖలోని తగరపువలసలోని ఓ కళాశాలకు వచ్చి చిత్ర విశేషాలను వివరించారు. ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని పేర్కొన్నారు.

3/15
 జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మూడు నదుల సంగమం ముచ్చటగొలుపుతోంది.. మహారాష్ట్ర నుంచి పొరుగున ఉన్న సిరొంచ మీదుగా ప్రాణహిత నది ప్రవహిస్తోంది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ సరిహద్దుల వెంట గోదావరి ప్రవాహం వచ్చి కాళేశ్వరం ప్రముఖుల ఘాట్‌ వద్ద కలుస్తోంది. మూడో నది అంతర్వాహిణిగా సరస్వతీ నది ఇక్కడే సంగమిస్తోంది.. మూడు నదుల కలిసిన చోటు త్రివేణి సంగమ తీరంగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడే కాళేశ్వర క్షేత్రంలో కొలువైన ద్విలింగాలకు భక్తులు జలాభిషేకం చేస్తూ పూజలు నిర్వహిస్తుంటారు.

4/15
  అసలే ఆటో.. ఆపై పరిమితికి మించి ప్రయాణం. ఏ మాత్రం అదుపుతప్పినా ‘ఆటో’..ఇటో ప్రమాదం జరిగే అవకాశం ఉంది.యాదాద్రి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండల కేంద్రంలో  ఆదర్శ పాఠశాల విద్యార్థులు నిత్యం ఇలా కిక్కిరిసి ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. 

5/15
 హైదరాబాద్‌లోని దుర్గంచెరువు తీగల వంతెనపై నిర్వహణ పనుల నేపథ్యంలో నేటి నుంచి 3 రోజులపాటు రాకపోకలు నిలిపివేయనున్నారు. వాహనదారులు, పాదచారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలంటూ సూచికలు ఏర్పాటు చేశారు.

6/15
  హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో టిప్పర్ల వేగానికి కళ్లెం పడలేదు. నిర్ణీత సమయం పాటించకుండా, మితిమీరిన లోడుతో వేగంగా వెళ్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కొందరు మట్టి, ఇసుక లోడుతో వెళ్తూ కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. కోకోపేట వద్ద ఇసుకను రోడ్డుపై పడేసుకుంటూ ఓ టిప్పర్‌ వెళ్తున్న సమయంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

7/15
 హైదరాబాద్‌ నగరంలో గురువారం మధ్యా హ్నం గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు.. ఉరుములు, మెరుపులు.. వడగళ్ల వానతో వర్షాకాలాన్ని తలపించింది. గంటపాటు భారీ వర్షంతో రహదారులు జలమయమయ్యాయి.

8/15
హైదరాబాద్‌లోని  శామీర్‌పేటలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌(ఐపీఈ)లో ప్రధాన భవనం మధ్యలోని  స్థలంలో మొక్కలు పెంచి పచ్చదనాన్ని పంచారు. విద్యతో పాటు హరితహారానికి ప్రాధాన్యమిస్తూ విద్యార్థులకు ఆహ్లాదం పంచేలా పెంచిన అలంకరణ మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. 

9/15
  హైదరాబాద్‌లోని   నాంపల్లి మెట్రోస్టేషన్‌ వద్ద ఎస్కలేటర్‌ పాడై  నెలలు  గడుస్తోంది. మరమ్మతులు చేయించడం లేదు. వృద్ధులు, చిన్నారులు మెట్లు ఎక్కలేక  పడరాని పాట్లు పడుతున్నారు.  

10/15
 హైదరాబాద్‌ నగర సుందరీకరణలో భాగంగా కూడళ్లతో పాటు బాహ్య వలయ రహదారి మార్గాన్ని సైతం వివిధ రకాల బొమ్మలతో తీర్చిదిద్దుతున్నారు. అందులో భాగంగా గచ్చిబౌలి నానక్‌రాంగూడ టోల్‌ కేంద్రం వద్ద ‘జాయ్‌ ఆఫ్‌ లైఫ్‌’ థీమ్‌తో పక్షులను వదులుతున్నట్లు ఏర్పాటు చేసిన చిహ్నం ఆకట్టుకుంటోంది. 

11/15
  హనుమాన్‌ జయంతి సందర్భంగా గుజరాత్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా 54 అడుగుల ఎత్తైన హనుమాన్‌ విగ్రహాన్ని, బంగారం, వెండితో చేసిన మరో ప్రతిమను ఆవిష్కరించారు. బోటాడ్‌లోని సారంగ్‌పుర్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన షా.. అనంతరం వాటిని ఆవిష్కరించారు. సూరత్‌కు చెందిన ఓ నిర్మాణ రంగ వ్యాపారి.. ఆరున్నర అడుగుల హనుమాన్‌ ప్రతిమను ఏర్పాటు చేశారు

12/15
 ప్రముఖ చిత్రకారుడు పికాసోకు నివాళిగా ఇటలీలోని కాస్టగ్‌నరో సమీపంలో ఓ పొలంలో ఆయన చిత్రాన్ని డేరియో గంబరిన్‌ అనే కళాకారుడు ఇలా చిత్రించారు

13/15
 భాజపా 44వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం దిల్లీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో గోడపై పార్టీ గుర్తును చిత్రీకరిస్తున్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

14/15
  ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో వ్యవసాయ ప్రదర్శనకు తీసుకొచ్చిన ఈ దున్నపోతు ధర ఎంతో తెలుసా? అక్షరాలా రూ.10 కోట్లు. దీంతో ప్రదర్శనకు వచ్చిన వారంతా దీనిని ఆసక్తిగా తిలకించారు.

15/15
  యాదాద్రి పుణ్యక్షేత్రంలోని విష్ణు పుష్కరిణిలో చైత్ర పౌర్ణమి సందర్భంగా గురువారం సాయంత్రం తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకరించి తెప్పపైకి చేర్చి జలవిహారం చేయించారు.

మరిన్ని