News In Pics: చిత్రం చెప్పే సంగతులు - 1 (25-09-2022)

Updated : 25 Sep 2022 11:53 IST
1/20
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని గజ్వేల్‌కు చెందిన రామకోటి భక్త సమాజం వ్యవస్థాపకుడు రామకోటి రామరాజు శనివారం నవ ధాన్యాలతో 12 అడుగుల భారీ బతుకమ్మను తీర్చిదిద్దారు. 9 రోజుల పాటు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడిపాడటం మన సాంప్రదాయమని, అందుకే నవ ధాన్యాలతో రూపొందించినట్లు తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలకు దీన్ని అంకితమిస్తున్నట్లు వెల్లడించారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని గజ్వేల్‌కు చెందిన రామకోటి భక్త సమాజం వ్యవస్థాపకుడు రామకోటి రామరాజు శనివారం నవ ధాన్యాలతో 12 అడుగుల భారీ బతుకమ్మను తీర్చిదిద్దారు. 9 రోజుల పాటు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడిపాడటం మన సాంప్రదాయమని, అందుకే నవ ధాన్యాలతో రూపొందించినట్లు తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలకు దీన్ని అంకితమిస్తున్నట్లు వెల్లడించారు.
2/20
ప్రతి శనివారం ‘ప్రమాద రహిత దినం’ నిర్వహిస్తున్న ఒంగోలు పోలీసులు ఈ సారి వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఒంగోలు నగరంలో శిరస్త్రాణం ధరించకుండా వాహనాలు నడుపుతున్న పలువురిని గుర్తించి పట్టుకున్నారు. వారికి జరిమానాలు విధించలేదు. శిరస్త్రాణం ధరించని వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురైతే ఎటువంటి దెబ్బలు తగులుతాయి? అవి ఎంత ప్రాణాంతకమో తెలిసేలా వారితో వేషాలు వేయించారు. తలకు, కాళ్లూ చేతులకు కట్లు కట్టారు. ప్రమాదాల్లో గాయాలపాలై బతికి బట్టకట్టినా బతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో అవగాహన ప్రదర్శన నిర్వహించారు. మంగమూరు రోడ్డు, వెంగముక్కలపాలెం కూడలి ప్రాంతాల్లో ఎస్పీ మలికా గార్గ్‌ పర్యటించి చోదకులకు రోడ్డు భద్రతా నియమాలను వివరించారు. 
ప్రతి శనివారం ‘ప్రమాద రహిత దినం’ నిర్వహిస్తున్న ఒంగోలు పోలీసులు ఈ సారి వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఒంగోలు నగరంలో శిరస్త్రాణం ధరించకుండా వాహనాలు నడుపుతున్న పలువురిని గుర్తించి పట్టుకున్నారు. వారికి జరిమానాలు విధించలేదు. శిరస్త్రాణం ధరించని వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురైతే ఎటువంటి దెబ్బలు తగులుతాయి? అవి ఎంత ప్రాణాంతకమో తెలిసేలా వారితో వేషాలు వేయించారు. తలకు, కాళ్లూ చేతులకు కట్లు కట్టారు. ప్రమాదాల్లో గాయాలపాలై బతికి బట్టకట్టినా బతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో అవగాహన ప్రదర్శన నిర్వహించారు. మంగమూరు రోడ్డు, వెంగముక్కలపాలెం కూడలి ప్రాంతాల్లో ఎస్పీ మలికా గార్గ్‌ పర్యటించి చోదకులకు రోడ్డు భద్రతా నియమాలను వివరించారు.
3/20
 మండల కేంద్రమైన మక్కువలో మూడు రోజులుగా రక్షిత మంచినీటి పథకం ద్వారా సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ సుమారు 8 వేల మంది నివాసం ఉంటున్నారు. కొందరు ఇళ్లలోని బోర్ల నీటిని వినియోగిస్తుండగా.. మిగిలిన వారు సమీపంలోని సువర్ణముఖి నదికి వెళ్లి తెచ్చుకుంటున్నారు. ఇటీవల నీటిని పంపింగ్‌ చేసే పైపులైను పగిలిపోవడంతో సరఫరా నిలిచిందని, మరమ్మతులు చేస్తామని పంచాయతీ కార్యదర్శి సురేష్‌ తెలిపారు.      మండల కేంద్రమైన మక్కువలో మూడు రోజులుగా రక్షిత మంచినీటి పథకం ద్వారా సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ సుమారు 8 వేల మంది నివాసం ఉంటున్నారు. కొందరు ఇళ్లలోని బోర్ల నీటిని వినియోగిస్తుండగా.. మిగిలిన వారు సమీపంలోని సువర్ణముఖి నదికి వెళ్లి తెచ్చుకుంటున్నారు. ఇటీవల నీటిని పంపింగ్‌ చేసే పైపులైను పగిలిపోవడంతో సరఫరా నిలిచిందని, మరమ్మతులు చేస్తామని పంచాయతీ కార్యదర్శి సురేష్‌ తెలిపారు.
4/20
రాజమహేంద్రవరంలో గోదావరి వరద స్వల్పంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నీరు నదిలోకి చేరుతోంది. ఉప నదుల్లోనూ నీరు చేరుతుండడంతో ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద శనివారం సాయంత్రం 6 గంటలకు నీటి మట్టం 10.10 అడుగులకు చేరింది. దీంతో 5,96,719 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వర్షాల ప్రభావం కారణంగా నీటి ప్రవాహం పెరిగే ఆస్కారం ఉందని ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. రాజమహేంద్రవరంలో గోదావరి వరద స్వల్పంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నీరు నదిలోకి చేరుతోంది. ఉప నదుల్లోనూ నీరు చేరుతుండడంతో ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద శనివారం సాయంత్రం 6 గంటలకు నీటి మట్టం 10.10 అడుగులకు చేరింది. దీంతో 5,96,719 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వర్షాల ప్రభావం కారణంగా నీటి ప్రవాహం పెరిగే ఆస్కారం ఉందని ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు.
5/20
ఫెదరర్‌, నాదల్‌.. టెన్నిస్‌ కోర్టులో విజయం కోసం ప్రాణం పెట్టి పోరాడిన వీరులు. హోరాహోరీ పోరాటాల్లో బద్ధ శత్రువుల్లాగా తలపడ్డారు. ఒకరిపై మరొకరి ఆధిపత్యం కోసం చెమట చిందించారు. అలాంటి ప్రత్యర్థులే తమలో ఒకరు ప్రొఫెషనల్‌ ఆటకు వీడ్కోలు పలుకుతున్నారనే నిజాన్ని జీర్ణించుకోలేక.. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. ఫెదరర్‌తో ఇక పోటీపడలేమని తెలిశాక నాదల్‌ హృదయం ద్రవించింది. లండన్‌లో ఫెదరర్‌ చివరి మ్యాచ్‌ ఆడిన తర్వాత.. ఇలా ఈ ఇద్దరూ కలిసి కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యం.. టెన్నిస్‌ ప్రపంచాన్ని కదిలించింది. ఫెదరర్‌, నాదల్‌.. టెన్నిస్‌ కోర్టులో విజయం కోసం ప్రాణం పెట్టి పోరాడిన వీరులు. హోరాహోరీ పోరాటాల్లో బద్ధ శత్రువుల్లాగా తలపడ్డారు. ఒకరిపై మరొకరి ఆధిపత్యం కోసం చెమట చిందించారు. అలాంటి ప్రత్యర్థులే తమలో ఒకరు ప్రొఫెషనల్‌ ఆటకు వీడ్కోలు పలుకుతున్నారనే నిజాన్ని జీర్ణించుకోలేక.. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. ఫెదరర్‌తో ఇక పోటీపడలేమని తెలిశాక నాదల్‌ హృదయం ద్రవించింది. లండన్‌లో ఫెదరర్‌ చివరి మ్యాచ్‌ ఆడిన తర్వాత.. ఇలా ఈ ఇద్దరూ కలిసి కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యం.. టెన్నిస్‌ ప్రపంచాన్ని కదిలించింది.
6/20
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం తేకుమంద గ్రామానికి చెందిన చంద్రమోహన్‌ వయసు 38. 2015లో పొలంలోని చెట్టు ఎక్కగా.. పట్టుతప్పి కింద పడిపోయాడు. తలకు గాయం కావడంతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్‌ చేయగా తల ఇలా అణిగిపోయింది. కాళ్లు, చేతులు చచ్చుబడ్డాయి. ఆసుపత్రి ఖర్చుల కోసం 2.5 ఎకరాల పొలం విక్రయించి అప్పులు తీర్చారు. పింఛను సొమ్ము ప్రతి నెల మాత్రలకే సరిపోతుందని, తనకు జీవనాధారం కల్పించాలని నాయకులు, అధికారులకు విన్నవించామని బాధితుడు చంద్రమోహన్‌ తల్లిదండ్రులు గోవిందమ్మ, క్రిష్ణయ్యలు తెలిపారు. అయినా ఫలితం లేకపోవడంతో కొన్ని డబ్బులు పోగేసుకుని ముఖ్యమంత్రికి తమ బాధను విన్నవించేందుకు విజయవాడ, కడపకు వెళ్లామని.. అక్కడి అధికారులు సీఎంను కలిసేందుకు అవకాశం ఇవ్వలేదని వారు వాపోయారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం తేకుమంద గ్రామానికి చెందిన చంద్రమోహన్‌ వయసు 38. 2015లో పొలంలోని చెట్టు ఎక్కగా.. పట్టుతప్పి కింద పడిపోయాడు. తలకు గాయం కావడంతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్‌ చేయగా తల ఇలా అణిగిపోయింది. కాళ్లు, చేతులు చచ్చుబడ్డాయి. ఆసుపత్రి ఖర్చుల కోసం 2.5 ఎకరాల పొలం విక్రయించి అప్పులు తీర్చారు. పింఛను సొమ్ము ప్రతి నెల మాత్రలకే సరిపోతుందని, తనకు జీవనాధారం కల్పించాలని నాయకులు, అధికారులకు విన్నవించామని బాధితుడు చంద్రమోహన్‌ తల్లిదండ్రులు గోవిందమ్మ, క్రిష్ణయ్యలు తెలిపారు. అయినా ఫలితం లేకపోవడంతో కొన్ని డబ్బులు పోగేసుకుని ముఖ్యమంత్రికి తమ బాధను విన్నవించేందుకు విజయవాడ, కడపకు వెళ్లామని.. అక్కడి అధికారులు సీఎంను కలిసేందుకు అవకాశం ఇవ్వలేదని వారు వాపోయారు.
7/20
ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన ఈ పాఠశాలపై పిచ్చి మొక్కలు పెరిగి చెట్లుగా మారుతుండటంతో భవన గోడలు బీటలు వారి కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. మండల కేంద్రంలోని ధరణికోట ప్రాథమిక పాఠశాల భవనం ముందు భాగంలోనూ ఇనుప చువ్వలు బయటపడి చినుకు పడినా పైకప్పు అంతా నీరు కారుతోంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 55 మంది విద్యార్థులకు ఒక తరగతి గది ఉండటంతో వరండాలో కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు. ఎప్పుడు కూలుతుందోనని భయపడుతూ బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. నాడు-నేడు పనులు త్వరగా మొదలుపెట్టాలని వారు కోరుతున్నారు. - ఈనాడు పల్నాడు ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన ఈ పాఠశాలపై పిచ్చి మొక్కలు పెరిగి చెట్లుగా మారుతుండటంతో భవన గోడలు బీటలు వారి కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. మండల కేంద్రంలోని ధరణికోట ప్రాథమిక పాఠశాల భవనం ముందు భాగంలోనూ ఇనుప చువ్వలు బయటపడి చినుకు పడినా పైకప్పు అంతా నీరు కారుతోంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 55 మంది విద్యార్థులకు ఒక తరగతి గది ఉండటంతో వరండాలో కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు. ఎప్పుడు కూలుతుందోనని భయపడుతూ బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. నాడు-నేడు పనులు త్వరగా మొదలుపెట్టాలని వారు కోరుతున్నారు. - ఈనాడు పల్నాడు
8/20
9/20
కార్లు రైలెక్కాయి. సికింద్రాబాద్‌ - నడికుడి - గుంటూరు రైల్వే మార్గంలో నల్గొండ జిల్లా దామరచర్ల మండల పరిధిలో శనివారం ఈ దృశ్యం కనిపించింది. సుమారు కిలోమీటరు దూరం ఉన్న ఈ గూడ్సుపై వందల కార్లను ఇలా రవాణా చేస్తుండగా స్థానికులు ఆసక్తిగా వీక్షించారు. కార్లు రైలెక్కాయి. సికింద్రాబాద్‌ - నడికుడి - గుంటూరు రైల్వే మార్గంలో నల్గొండ జిల్లా దామరచర్ల మండల పరిధిలో శనివారం ఈ దృశ్యం కనిపించింది. సుమారు కిలోమీటరు దూరం ఉన్న ఈ గూడ్సుపై వందల కార్లను ఇలా రవాణా చేస్తుండగా స్థానికులు ఆసక్తిగా వీక్షించారు.
10/20
వర్షాలకు శ్రీనగర్‌ కాలనీలోని ఆర్‌బీఐ చౌరస్తా వద్ద భారీగా గుంతలు పడ్డాయి. రాత్రుళ్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. తక్షణం మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. వర్షాలకు శ్రీనగర్‌ కాలనీలోని ఆర్‌బీఐ చౌరస్తా వద్ద భారీగా గుంతలు పడ్డాయి. రాత్రుళ్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. తక్షణం మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.
11/20
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం లోసంగి గిరిజన గ్రామంలో మౌస్‌డీర్‌ పిల్లను నర్సీపట్నం అటవీ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. రెండు నెలల వయసున్న ఈ మౌస్‌డీర్‌ అరుదైనదని డీఎఫ్‌ఓ తెలిపారు. దీన్ని విశాఖపట్నం జంతు ప్రదర్శనశాలకు అప్పగిస్తామన్నారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం లోసంగి గిరిజన గ్రామంలో మౌస్‌డీర్‌ పిల్లను నర్సీపట్నం అటవీ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. రెండు నెలల వయసున్న ఈ మౌస్‌డీర్‌ అరుదైనదని డీఎఫ్‌ఓ తెలిపారు. దీన్ని విశాఖపట్నం జంతు ప్రదర్శనశాలకు అప్పగిస్తామన్నారు.
12/20
ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో రాణించాలని, కొత్తగా స్థాపించనున్న జాతీయ పార్టీ విజయవంతంగా నడవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ వక్ఫ్‌బోర్డ్‌ ఛైర్మన్‌ మసియుల్లా ఖాన్‌ ఆధ్వర్యంలో తెరాస మైనారిటీ నేతలు రాజస్థాన్‌లోని అజ్‌మేర్‌ దర్గాలో చాదర్‌ సమర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో రాణించాలని, కొత్తగా స్థాపించనున్న జాతీయ పార్టీ విజయవంతంగా నడవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ వక్ఫ్‌బోర్డ్‌ ఛైర్మన్‌ మసియుల్లా ఖాన్‌ ఆధ్వర్యంలో తెరాస మైనారిటీ నేతలు రాజస్థాన్‌లోని అజ్‌మేర్‌ దర్గాలో చాదర్‌ సమర్పించారు.
13/20
హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో శనివారం బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రామాలయం ఆవరణలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో శనివారం బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రామాలయం ఆవరణలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు.
14/20
కూకట్‌పల్లిలోని రంగధాముని చెరువులో బతుకమ్మల నిమజ్జనం కూకట్‌పల్లిలోని రంగధాముని చెరువులో బతుకమ్మల నిమజ్జనం
15/20
ఉప్పల్‌ మైదానంలో ఆదివారం జరగనున్న టీ20 మ్యాచ్‌లో ఆడేందుకు భారత్‌-ఆస్ట్రేలియా క్రికెటర్లు శనివారం శంషాబాద్‌  విమానాశ్రయానికి చేరుకున్నారు. క్రికెటర్లను నేరుగా చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భారీ బందోబస్తు నడుమ ప్రత్యేక బస్సుల్లో క్రీడాకారులు బంజారాహిల్స్‌లోని హోటల్‌కు చేరుకున్నారు. ఉప్పల్‌ మైదానంలో ఆదివారం జరగనున్న టీ20 మ్యాచ్‌లో ఆడేందుకు భారత్‌-ఆస్ట్రేలియా క్రికెటర్లు శనివారం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. క్రికెటర్లను నేరుగా చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భారీ బందోబస్తు నడుమ ప్రత్యేక బస్సుల్లో క్రీడాకారులు బంజారాహిల్స్‌లోని హోటల్‌కు చేరుకున్నారు.
16/20
17/20
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమవుతోంది. ప్రధాన రహదారులు, ఉద్యానవనాలు, స్వామివారి ఆలయం వద్ద విద్యుత్‌ అలంకరణలు పూర్తయి కాంతులీనుతోంది.     శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమవుతోంది. ప్రధాన రహదారులు, ఉద్యానవనాలు, స్వామివారి ఆలయం వద్ద విద్యుత్‌ అలంకరణలు పూర్తయి కాంతులీనుతోంది.
18/20
హరియాణాలోని గురుగ్రామ్‌లో దిల్లీ-గురుగ్రామ్‌ రహదారిపై శనివారం వర్షపు నీటిలో వాహనాల పయనం హరియాణాలోని గురుగ్రామ్‌లో దిల్లీ-గురుగ్రామ్‌ రహదారిపై శనివారం వర్షపు నీటిలో వాహనాల పయనం
19/20
పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దుర్గా పూజ కోసం సిద్ధమవుతున్న మండపం పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దుర్గా పూజ కోసం సిద్ధమవుతున్న మండపం
20/20
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గంగా నదిలో అస్థికలను నిమజ్జనం చేస్తున్న వీరంతా దిల్లీ కేంద్రంగా పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు. గత కొన్ని నెలలుగా ఎవరూ తీసుకెళ్లని సుమారు 4,000 మృతదేహాలకు అంత్య క్రియలు నిర్వహించారు. ఆ అస్థికలను శనివారం హరిద్వార్‌లో ఇలా గంగానదిలో కలిపారు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గంగా నదిలో అస్థికలను నిమజ్జనం చేస్తున్న వీరంతా దిల్లీ కేంద్రంగా పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు. గత కొన్ని నెలలుగా ఎవరూ తీసుకెళ్లని సుమారు 4,000 మృతదేహాలకు అంత్య క్రియలు నిర్వహించారు. ఆ అస్థికలను శనివారం హరిద్వార్‌లో ఇలా గంగానదిలో కలిపారు

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు