ఆర్జేడీ కూటమి నుంచి ఆర్‌ఎల్‌ఎస్‌పీ ఔట్‌!

తాజా వార్తలు

Published : 30/09/2020 01:32 IST

ఆర్జేడీ కూటమి నుంచి ఆర్‌ఎల్‌ఎస్‌పీ ఔట్‌!

పట్నా: బిహార్‌ ఎన్నికలు రాజకీయ చదరంగాన్ని తలపిస్తున్నాయి. ఓ వైపు పోలింగ్‌ తేదీలు దగ్గర పడుతుండగా.. ఇప్పటి వరకు కూటముల్లో సీట్ల పంపిణీ ఖారారు కాలేదు.  తమకు సరైన న్యాయం జరగడం లేదనే ఉద్దేశంతో పలు పార్టీలు కూటముల నుంచి బయటకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా మాజీ కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్‌పీ) విపక్ష ఆర్జేడీ కూటమి నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో మళ్లీ మూడో ఫ్రంట్‌ ఏర్పాటు తథ్యమనిపిస్తోంది. 

2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌ఎల్‌ఎస్‌పీ ఎన్‌డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది. అయితే 2019 జనరల్‌ ఎన్నికలకు ముందు భాజపాతో విభేదించి కూటమి నుంచి వైదొలిగి, ప్రతిపక్ష ఆర్జేడీ కూటమిలో చేరింది. అయితే తాజాగా సీట్ల పంపిణీ అంశంలో ఆర్జేడీ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వియాదవ్‌తో విభేదాలు తలెత్తడంతో కూటమి నుంచి బయటకొచ్చి బీఎస్పీతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు అధికార భాజపా నుంచి కూడా తమకు ఆహ్వానం ఉందని ఆర్‌ఎల్ఎస్‌పీ నేతలు చెబుతుండటం గమనార్హం. అంతేకాకుండా బీజేపీ-జేడీయూ కూటమితో రాం విలాస్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని ఎల్జేపీ తెగతెంపులు చేసుకుంటుందనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహాగట్‌ బంధన్‌ నుంచి ఆర్‌ఎల్‌ఎస్పీ వైదొలగడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. బిహార్‌లో మూడు విడతలుగా అక్టోబర్‌ 28, నవంబర్‌ 3, నవంబర్‌ 7 తేదీల్లో ఎన్నికలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని