​​​​​అవసరమైతే రాష్ట్రపతిని కలుస్తాం: గహ్లోత్‌

తాజా వార్తలు

Published : 26/07/2020 02:53 IST

​​​​​అవసరమైతే రాష్ట్రపతిని కలుస్తాం: గహ్లోత్‌

జైపుర్: అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌ స్వరం పెంచారు. అవసరమైతే తాము రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలుస్తామని చెప్పారు. ఇంకా అవసరమైతే ప్రధాని మోదీ నివాసం బయట ఆందోళనకు సిద్ధమని ప్రకటించారు. తమ వర్గం ఎమ్మెల్యేలు ఉన్న ఫెయిర్‌మాంట్‌ హోటల్‌లో నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో ఆయన  ఈ వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ఇదే హోటల్‌లో తమ ఎమ్మెల్యేలు 21 రోజులకు పైగా ఉండేందుకు సిద్ధమని ప్రకటించారు.

కేబినెట్‌ భేటీకి ముందు ఈ సమావేశం జరిగింది. అనంతరం గహ్లోత్‌ నివాసంలో కేబినెట్‌ భేటీ జరిగింది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి కేబినెట్‌ సిఫార్సు లేఖతో మంత్రులు గవర్నర్‌ కలిసేందుకు వెళ్లారు. దీంతో గవర్నర్‌ ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు 12 మందితో కూడిన భాజపా బృందం గవర్నర్‌ను కలిసింది. రాష్ట్రంలో పరిస్థితిని ఆ బృందం వివరించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని