అదనపు వ్యాట్‌ సామాన్యుడికి భారం: తెదేపా

తాజా వార్తలు

Published : 21/07/2020 11:21 IST

అదనపు వ్యాట్‌ సామాన్యుడికి భారం: తెదేపా

అమరావతి: పెట్రోల్‌, డీజిల్‌పై అదనపు వ్యాట్‌ భారాన్ని ఏపీ ప్రభుత్వం రూ.4కి పెంచడాన్ని మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, దేవినేని ఉమా మహేశ్వరరావు ఖండించారు. పెంచిన పన్నును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.  అసలే పెరిగిన పెట్రో ధరలతో ప్రజలు అల్లాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ భారం రూ.4కి పెంచడం తగదన్నారు. మోపెడ్‌ నడిపే సామాన్యుడిపై, ఆయిలింజన్‌ ఉపయోగించే సన్నకారు రైతుపై, బెంజ్‌ కారు వాడే ధనవంతుడిపై ఒకేలా పన్ను పెంపు న్యాయమా? అని ప్రశ్నించారు.

ఈ ప్రభావం నిత్యావసరాల ధరలపై పడి ఇంకా భారమయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. గతంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తెదేపా ప్రభుత్వం హయాంలో రూ.2 భారం తగ్గించిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఓ వైపు ధరలు, మరోవైపు పన్ను పెంచి కరోనా కాలంలో ప్రజలను మరింత కష్టాలకు గురిచేయడం దారుణమని మండిపడ్డారు. పెట్రోల్‌, డీజిల్‌ వ్యాట్‌ ధరలపై బాదుడు బాదుతున్నారని గతంలో శాసనసభలో మాట్లాడిన మాటలు గుర్తున్నాయా జగన్‌ అంటూ ఎద్దేవా చేశారు. ఈమేరకు ట్విటర్‌లో వీడియో విడుదల చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని