బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది: ఆళ్ల నాని

తాజా వార్తలు

Updated : 08/05/2020 14:48 IST

బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది: ఆళ్ల నాని

వన్‌టౌన్‌ (విశాఖపట్నం): విషవాయువు ప్రభావం కారణంగా 554 మంది అస్వస్థతకు గురయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. శుక్రవారం ఆయన రాష్ట్ర మంత్రులు కన్నబాబు, బొత్స సత్యనారాయణ, జయరాం, అవంతి శ్రీనివాస్‌, ధర్మాన కృష్ణదాస్‌లతో కలిసి కేజీహెచ్‌ పిల్లల వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. అనంతరం మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ... మొత్తం బాధితుల్లో 128 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లారన్నారు. మిగతా 426 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. గ్యాస్‌ లీకేజీ అదుపులో ఉందని, వాతావరణం కుదుట పడుతున్నట్లు చెప్పారు. బాధితులను ప్రభుత్వమే అన్ని విధాల ఆదుకుంటుందని స్పష్టం చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని