ఓటమి వేళ భాజపా అస్త్రం.. సోదాలు

తాజా వార్తలు

Published : 02/04/2021 17:44 IST

ఓటమి వేళ భాజపా అస్త్రం.. సోదాలు

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శలు

దిల్లీ: తమిళనాడులో శాసనసభ ఎన్నికల ముందు డీఎంకే నేతల ఇళ్లపై జరుగుతున్న ఆదాయ పన్ను సోదాలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. ఓటమి భయంతోనే భాజపా ఇలాంటి దాడులకు పాల్పడుతోందంటూ ట్విటర్‌ వేదికగా దుయ్యబట్టారు. ‘‘ఎన్నికల్లో ఓటమి ఎదురవుతున్న సమయంలో భాజపా ఉపయోగించే సిద్ధాంతం.. ప్రతిపక్షాలపై దాడులు చేయించడం’’ అని రాహుల్‌ విమర్శించారు. 

డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ అల్లుడు శబరీశన్‌ ఇంట్లో శుక్రవారం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. శబరీశన్‌ నివాసంతో పాటు డీఎంకే పార్టీకి చెందిన నాలుగు ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. అన్నానగర్‌ డీఎంకే అభ్యర్థి మోహన్‌ కుమారుడి ఇంట్లోనూ సోదాలు జరిపారు. అయితే ఈ దాడులను డీఎంకే తీవ్రంగా ఖండించింది. రాజకీయ దురుద్దేశంతోనే ఎన్నికల ముందు కేంద్రం ఈ సోదాలు జరిపిస్తోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌ ఆరోపించారు. ఇలాంటి వాటికి భయపడేది లేదని పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌ చెప్పారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని