close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విరాళాలు ఎలా ఖర్చుపెట్టారు?

  శ్వేతపత్రం విడుదల చేయాలి
  సీఎంకు బండి సంజయ్‌ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయనిధికి, కేటీఆర్‌కు అందించిన విరాళాలను ఎలా ఖర్చు పెట్టారో ప్రజలకు తెలియజేయాలని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. అలాగే కరోనా నియంత్రణకు కేంద్రం ఇచ్చిన నిధులను ఎలా ఖర్చు పెట్టారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో రైతులకు రైతుబంధు సహాయం అందడం లేదని, ఈ పథకాన్ని భవిష్యత్తులో కొనసాగిస్తారో లేదో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. ఈ మేరకు సంజయ్‌ సోమవారం సీఎం కేసీఆర్‌కు లేఖరాశారు. ‘‘దేశం, రాష్ట్రాల బాగుకోసం ఆత్మనిర్భర్‌ ప్యాకేజీని ప్రకటిస్తే లేనిపోని విమర్శలు చేస్తున్నారు. మాటల గారడీతో కేంద్రంపై అర్థరహిత విమర్శలు చేస్తున్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి సంస్కరణలపై అసంబద్ధ ఆరోపణలు చేశారు. సంస్కరణలు తేవడం ప్రభుత్వ పాలనలో ఒక భాగం. రైతుబంధు ఆర్థిక సహాయాన్ని, పంటల నియంత్రిత పద్ధతితో ముడిపెట్టడం ఎంతవరకు సమంజసం? కేంద్ర ప్రభుత్వం ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కింద ఇచ్చిన రూ.224 కోట్లు, వైద్య పరికరాలకు ఇచ్చిన రూ.216 కోట్లు, పన్నుల వాటా కింద ఇచ్చిన రూ.982 కోట్లను ఎలా ఖర్చు చేశారో ప్రజలకు చెప్పాలి’ అని లేఖలో పేర్కొన్నారు.

పవన్‌కల్యాణ్‌తో సంజయ్‌ భేటీ

తెలంగాణలో అవసరమైన సందర్భాల్లో భాజపాతో కలిసి పనిచేసేందుకు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సిద్ధంగా ఉన్నట్లు బండి సంజయ్‌ తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రుల వైఖరిని ప్రజలకు వివరిస్తూ ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడతామని పేర్కొన్నారు. సోమవారమిక్కడ పవన్‌కల్యాణ్‌తో ఆయన సమావేశమయ్యారు. అనంతరం సంజయ్‌ విలేకరులతో మాట్లాడారు. ‘‘ఇరు రాష్ట్రాల్లోని రాజకీయ పరిణామాలపై చర్చించాం. పోతిరెడ్డిపాడుపై జరిగిన విషయాన్ని వివరించాను. తెలంగాణ ప్రజలు, భాజపా ఏపీకి వ్యతిరేకం కాదు. నిబంధనల మేరకు నడుచుకోవాలని కోరాం. ఫిబ్రవరిలో ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఏమి మాట్లాడుకున్నారో, లోపాయికారీ ఒప్పందాలేమిటో ప్రజలకు చెప్పాలి. దేవాలయాల ఆస్తులను కాపాడుకునేందుకు కమిటీలు వేయాలి తప్ప అమ్మేందుకు కాదు. తితిదే ఆస్తులు విక్రయించే అధికారం వారికి ఎవరిచ్చారు. రాజకీయాలకు అతీతంగా పార్టీలన్నీ కలిసి ఈ విషయంలో పనిచేయాలి’’ అని అన్నారు.

 

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.