close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
లింగోజిగూడ ఉపఎన్నిక అనివార్యం

ఎల్బీనగర్‌, న్యూస్‌టుడే: జీహెచ్‌ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌లో ఉప ఎన్నిక నిర్వహణ అనివార్యమైంది. గత డిసెంబరులో ఇక్కడ జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన భాజపా అభ్యర్థి రమేశ్‌ గౌడ్‌ ప్రమాణ స్వీకారానికి ముందే మరణించడంతో ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈ డివిజన్‌ ఏకగ్రీవం కోసం భాజపా ప్రయత్నించగా.. అధికార పార్టీ తెరాస అంగీకరించి పోటీకి దూరంగా నిలిచింది. కాంగ్రెస్‌ తన అభ్యర్థిని బరిలోకి దింపింది. నామినేషన్‌ ఉపసంహరణ ప్రక్రియ గడువు ముగియడంతో భాజపా అభ్యర్థిగా ఆకుల అఖిల్‌గౌడ్‌.. కాంగ్రెస్‌ తరఫున దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి పోటీలో నిలిచారు. ముగ్గురు స్వతంత్రులు బరిలో ఉన్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు