close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వరుస ఓటములు ఎదురైనా దిద్దుబాటేదీ?

పార్టీ తీరుపై అధిష్ఠానానికి కాంగ్రెస్‌ విధేయుల లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 2018 శాసనసభ ఎన్నికల తర్వాత వరస పరాజయాలు ఎదురవుతున్నా దిద్దుబాటు చేపట్టకపోవడం పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తోందని తెలంగాణ కాంగ్రెస్‌ విధేయుల ఫోరం అభిప్రాయపడింది. మంగళవారం ఫోరం వీడియో కాన్ఫరెన్స్‌ జరిగింది. మాజీ మంత్రులు మర్రి శశిధర్‌రెడ్డి, సంభాని చంద్రశేఖర్‌, కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, ఖాదీబోర్డు మాజీ ఛైర్మన్‌ జి.నిరంజన్‌ మాజీ ఎమ్మెల్సీ కమలాకరరావు, పీసీసీ మేధావుల విభాగం ఛైర్మన్‌ శ్యామ్‌మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, నాగార్జునసాగర్‌, మినీ పురపాలక పోరులో కాంగ్రెస్‌ ఓటమిపై సమీక్షించారు. పరిస్థితులను వివరిస్తూ కాంగ్రెస్‌ అధిష్ఠానానికి లేఖరాయాలని  నిర్ణయించారు. పార్టీ కోరిక మేరకు సాగర్‌ ఉప ఎన్నికలో పోటీ చేసిన సీనియర్‌ నాయకుడు జానారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

టీఎస్‌పీఎస్సీలో ఖాళీలను భర్తీ చేయాలి: కోమటిరెడ్డి
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం ఒంటెత్తు పోకడతో వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. హైకోర్టు ఆదేశించినట్లు నాలుగు వారాల్లోగా టీఎస్‌పీఎస్సీలో ఖాళీలను భర్తీ చేయాలని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఖాళీలపై హైకోర్టు వ్యాఖ్యలు తెరాస సర్కార్‌కు చెంపపెట్టు లాంటిదన్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు