Cricket News: ఆఖరి ఓవర్లో 35 పరుగులు! 

తాజా వార్తలు

Updated : 17/07/2021 12:27 IST

Cricket News: ఆఖరి ఓవర్లో 35 పరుగులు! 

డబ్లిన్‌: గెలవాలంటే ఆఖరి ఓవర్లో 35 పరుగులు కావాలి! మాములుగా అయితే ఇది దాదాపు అసాధ్యం. అలాంటిది ఆరు సిక్స్‌లు బాదేసి గెలిపిస్తే! నిజంగా అద్భుతమే! ఈ అద్భుతాన్నే చేశాడు బాలీమెనా బ్యాట్స్‌మన్‌ జాన్‌ గ్లాస్‌. ఐర్లాండ్‌ ఎల్‌వీఎస్‌ టీ20 ఫైనల్లో క్రెగాగ్‌-బాలీమెనా జట్ల మధ్య మ్యాచ్‌లో ఈ చిత్రం చోటు చేసుకుంది. మొదట క్రెగాగ్‌ 147 పరుగులు చేయగా.. మరో ఓవర్‌ మిగిలుండగా బాలీమెనా 113/7తో ఓటమి అంచున ఉంది. కానీ ఈ స్థితిలో చెలరేగిన జాన్‌ గ్లాస్‌ (87 నాటౌట్‌) చివరి ఆరు బంతుల్ని సిక్స్‌లుగా మలిచి జట్టును అనూహ్యంగా విజేతగా నిలిపాడు. ఇదే మ్యాచ్‌లో క్రెగాగ్‌ ఇన్నింగ్స్‌లో గ్లాస్‌ సోదరుడు సామ్‌ హ్యాట్రిక్‌ చేయడం మరో విశేషం. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని