అది ముంబయి డీఎన్‌ఏలోనే ఉంది
close

తాజా వార్తలు

Updated : 11/11/2020 10:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అది ముంబయి డీఎన్‌ఏలోనే ఉంది

ఐదోసారి టైటిల్‌ సాధించడంపై జయవర్దనే

ఇంటర్నెట్‌డెస్క్‌: బిగ్‌ హిట్టింగ్‌ అనేది ముంబయి డీఎన్‌ఏలోనే ఉందని, టోర్నీ ఆరంభానికి ముందే తమ సన్నద్ధం ప్రారంభమైందని ఆ జట్టు కోచ్‌ జయవర్దనే పేర్కొన్నాడు. గతరాత్రి దిల్లీపై విజయంతో రోహిత్‌ ఐదోసారి టైటిల్‌ సాధించిన సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్‌ అనంతరం జయవర్దనేతోపాటు శ్రేయస్‌ అయ్యర్‌, రికీ పాంటింగ్‌ స్పందించారు.

* ఇదో కష్టతరమైన టోర్నీ. బేసి సంఖ్య సంవత్సరాల్లోనే మేం విజయాలు సాధిస్తామని అనేక అపోహలు ఉన్నాయి. ఈ సందర్భంగా నేను రికీ పాంటింగ్‌, దిల్లీ జట్టును అభినందిస్తున్నా. ఈ ఏడాది వాళ్లు అద్భుతంగా ఆడారు. ఈరోజు కూడా బలమైన ప్రత్యర్థిగానే బరిలోకి దిగారు. ఈ సీజన్‌కు ముందు నుంచే మేం సన్నద్ధమయ్యాం. చాలా కాలంగా భారీ షాట్లు ఆడటమనేది ముంబయి జట్టు డీఎన్‌ఏలోనే ఉంది. అలాగే అన్ని విధాలుగా మాకు సహకరించిన జట్టు యాజమాన్యానికి ఈ ఫలితం దక్కుతుంది. వారి ప్రోత్సాహం వల్లే ఈరోజు చరిత్ర సృష్టించాం. సరైన ప్రణాళికతో సన్నద్ధమవ్వడం, ఆటగాళ్ల పాత్రలు వారికి తెలియజేయడం ఈ విజయంలో భాగం. అలాగే మాకు అత్యుత్తమ నాయకత్వ లక్షణాలున్న బృందంతో పాటు మేటి సహాయక సిబ్బంది ఉన్నారు. ఆటగాళ్లంతా ఈ సీజన్‌ మొత్తం కష్టపడడంతో ఇప్పుడా ప్రతిఫలం దక్కింది.  - జయవర్దనే (ముంబయి కోచ్‌)

* పాంటింగ్‌ మాకిచ్చే స్వేచ్ఛ బాగుంటుంది. అతడు ఆటగాళ్లను ప్రోత్సహించే తీరు అత్యద్భుతం. ఈ టోర్నీ ఎప్పుడూ అలరిస్తుంటుంది. ఇదొక కష్టతరమైన లీగ్‌. ఇందులో భాగస్వామి అయినందుకు సంతోషిస్తున్నా. ఇక ఈ సీజన్‌లో మా ఆటగాళ్ల ప్రదర్శన పట్ల గర్వంగా ఉన్నా. ఇలా ఫైనల్‌ చేరడం అనేది అంత తేలిక కాదు. కప్పు సాధించి ఉంటే ఇంకా బాగుండేది. ఇక వచ్చే ఏడాదైనా దాన్ని సాధించేందుకు కృషిచేస్తాం. ఈ సందర్భంగా మా అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతున్నా. మా వెన్నంటే ఉండి ఎంతో సహకరించిన సహాయక సిబ్బందికి కూడా కృతజ్ఞతలు. -శ్రేయస్‌ అయ్యర్‌ (దిల్లీ కెప్టెన్‌)

* ముంబయి అత్యుత్తమైన జట్టు. మమ్మల్ని నాలుగు సార్లు ఓడించారు. ఇలా డగౌట్‌లో కోచ్‌గా కూర్చోవడం చిరాకు తెప్పిస్తుంది. కానీ, మా ఆటగాళ్ల ప్రదర్శన పట్ల గర్వాంగా ఉంది. అయ్యర్‌ గొప్ప ఆటగాడు. కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగతంగా అద్భుతమైన ఆటగాడు. ఏడాది కాలంగా ఎంతో మెరుగయ్యాడు. ఇక భవిష్యత్‌లో మరింత ఎక్కువగా కలిసి పనిచేస్తామని ఆశిస్తున్నాం. టోర్నీకి నాలుగు వారాల ముందు నుంచే సన్నద్ధమవుతుండడంతో సాధన కాస్త ఎక్కువైంది. అయితే, ఈ సీజన్‌ మాత్రం చాలా గొప్పగా సాగింది. నేను ఆస్ట్రేలియా వదలడానికి సంకోచించా. కానీ నిర్వాహకులు మంచి ఏర్పాట్లు చేశారు. ఇకపోతే అన్ని జట్లతో పోలిస్తే మాదే యువ ఆటగాళ్లతో నిండింది. వారి ప్రదర్శన పట్ల నిజంగా గర్వపడుతున్నా.  -రికీ పాంటింగ్‌ (దిల్లీ కోచ్‌)

ఇవీ చదవండి:

సూర్యకుమార్‌ కోసం నా వికెట్‌ వదులుకోవాల్సింది

ముంబయి జట్టుకు గూగుల్‌ సర్‌ప్రైజ్‌

సరిలేరు మీకెవ్వరూ!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని