250 వికెట్ల క్లబ్బులో స్టార్క్‌

తాజా వార్తలు

Published : 27/12/2020 19:08 IST

250 వికెట్ల క్లబ్బులో స్టార్క్‌

మెల్‌బోర్న్‌: టీమ్‌ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతడు రిషభ్‌ పంత్(29)ను ఔట్‌ చేసి టెస్టుల్లో 250వ వికెట్‌ దక్కించుకున్నాడు. దాంతో ఆస్ట్రేలియా తరఫున తక్కువ మ్యాచ్‌ల్లో ఈ రికార్డు నెలకొల్పిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. 

స్టార్క్‌ కన్నా ముందు మాజీ దిగ్గజాలు డెన్నిస్‌ లిల్లీ 48 టెస్టుల్లో 250 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో నిలవగా తర్వాత షేన్‌ వార్న్‌, గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ 55 మ్యాచ్‌ల్లో అన్నే వికెట్లు తీసి రెండో స్థానంలో నిలిచారు. ఈ క్రమంలోనే మిచెల్‌ జాన్‌సన్‌ 57 టెస్టుల్లో.. స్టార్క్‌ 58వ మ్యాచ్‌లో ఆ రికార్డు నెలకొల్పారు. ఇదిలా ఉండగా, స్టార్క్‌ ఇటీవల అడిలైడ్‌లో టీమ్‌ఇండియాతో ఆడిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టగా, ఇప్పుడు రెండో టెస్టులో 2 వికెట్లు తీశాడు. శనివారం భారత ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే మయాంక్‌ అగర్వాల్‌ను డకౌట్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి..
జడేజా.. నిన్ను సూపర్‌ అనేది ఇందుకే!
తండ్రి కల నెరవేరింది.. సిరాజ్ భావోద్వేగం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని