close
Array ( ) 1

తాజా వార్తలు

టీ విరామానికి కివీస్‌ 116/2

వెల్లింగ్టన్‌: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్‌ ఆధిపత్యం చెలాయిస్తోంది. రెండో రోజు టీ విరామ సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ (2/17) మినహా ఎవరూ కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడిచేయలేకపోతున్నారు. ప్రస్తుతం కేన్ విలియమ్సన్ (46*), రాస్‌ టేలర్ (22*) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు అజేయంగా 43 పరుగులు జోడించారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 122/5తో రెండో రోజు ఆట ఆరంభించిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాట్స్‌మెన్‌లో రహానె (46), మయాంక్‌ అగర్వాల్‌ (34) ఫర్వాలేదనిపించారు. కివీస్‌ బౌలర్లలో జేమీసన్‌ (4/39), సౌథీ (4/49) రాణించారు. భారత్‌ కంటే కివీస్‌ ఇంకా 49 పరుగుల వెనుకంజలో ఉంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.