Tokyo olympics: ఇక కాంస్యం కోసమే.. సెమీస్‌లో దీపక్‌ పునియా ఓటమి

తాజా వార్తలు

Updated : 04/08/2021 15:43 IST

Tokyo olympics: ఇక కాంస్యం కోసమే.. సెమీస్‌లో దీపక్‌ పునియా ఓటమి

టోక్యో: భారత మరో రెజ్లర్‌ దీపక్‌ పునియా (86 కిలోలు) ఫామ్‌ కొనసాగించలేక పోయాడు. సెమీస్‌లో ఓటమి పాలయ్యాడు. ప్రత్యర్థికి కనీసం పోటీ ఇవ్వకుండా నిరాశ పరిచాడు. రవి దహియాతో పాటు పసిడి పట్టుకు చేరుకోలేకపోయాడు. అమెరికా కుస్తీవీరుడు డేవిడ్‌ మోరిస్‌ చేతిలో 0-10 తేడాతో ఘోర ఓటమి చవిచూశాడు. ఈ బౌట్లో ప్రత్యర్థి ముందు దీపక్‌ పునియా చిన్న పిల్లాడిలా ఆడాడు. ఏ మాత్రం ప్రతిఘటించలేక పోయాడు.

ఈ సెమీస్‌ పోరు కేవలం 2.49 నిమిషాల్లో ముగిసింది. మొదటి పిరియడ్‌లోనే డేవిడ్‌ మోరిస్‌ వరుసగా 1, 2, 2, 2, 2, 1 స్కోరు సాధించేశాడు. దీపక్‌ పునియా కాళ్లను మెలిపెట్టి టేక్‌డౌన్‌లు చేశాడు. అసలు పునియాకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. దాంతో రిఫరీ ప్రత్యర్థిని సాంకేతికంగా ముందంజలో ఉన్నాడని ప్రకటించాడు. ఇక భారత కుస్తీవీరుడు కాంస్యం కోసం పోరాడనున్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని