ENG vs PAK:పాక్‌ పర్యటనకు పంపరు.. ఐపీఎల్‌కు అనుమతా?

తాజా వార్తలు

Published : 23/09/2021 09:24 IST

ENG vs PAK:పాక్‌ పర్యటనకు పంపరు.. ఐపీఎల్‌కు అనుమతా?

లండన్‌: ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) తీరును ఆ దేశ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ అథర్టన్‌ తప్పుబట్టాడు. ఆటగాళ్ల సంక్షేమం కోసమని పాకిస్థాన్‌ పర్యటనకు జట్టును పంపని ఈసీబీ.. వారిని ఐపీఎల్‌కు మాత్రం ఎలా అనుమతిస్తుందని ప్రశ్నించాడు. ‘‘మూడు నెలల పాటు ఇంగ్లాండ్‌ ఆటగాళ్లకు దేశం తరఫున ఆడాల్సిన అవసరం లేకుండా, ఐపీఎల్‌కు అందుబాటులో ఉండేలా చూసే ఈసీబీ వారి సంక్షేమం గురించి మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఓవైపు ఆటగాళ్ల క్షేమం కోసమని పాకిస్థాన్‌ పర్యటనను రద్దు చేశారు. మరోవైపు బయో బబుల్‌ ఇబ్బందులు, అలసట ప్రభావం ఏంటో తెలిసి కూడా ఆటగాళ్లను ఐపీఎల్‌లో ఆడేందుకు ఎందుకు అనుమతిస్తున్నారు. భారత్‌ మాంచెస్టర్‌ టెస్టు నుంచి విరమించుకోవడం కంటే ఇది అభ్యంతరకరం’’ అని అథర్టన్‌ పేర్కొన్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని