Yuvraj singh: యువీ అరెస్ట్‌.. బెయిల్‌పై విడుదల

తాజా వార్తలు

Updated : 18/10/2021 09:14 IST

Yuvraj singh: యువీ అరెస్ట్‌.. బెయిల్‌పై విడుదల

చండీగఢ్‌: మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ను హరియాణా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత సంవత్సరం జరిగిన లైవ్ చాట్‌లో ఓ వర్గం వారిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశాడనే కేసు నమోదు నేపథ్యంలో అరెస్ట్‌ చేశారు. గతేడాది రోహిత్‌ శర్మతో జరిగిన లైవ్‌ చాటింగ్‌లో క్రికెటర్‌ యుజ్వేంద్ర చాహల్‌ను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఈ ఫిబ్రవరిలో హరియాణాలోని హన్సి నగర పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో ఇవాళ యువీని హిస్సార్‌ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు అరెస్ట్‌ అయిన కాసేపటికి యువీ విడుదలయ్యాడు. గతంలోనే ఈ విషయంపై యువీ క్షమాపణలు చెప్పడం గమనార్హం.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని